ETV Bharat / entertainment

'సికందర్' షూటింగ్​లో సల్మాన్ ఫొటోషూట్​! - అంతా 'కిక్​' కోసమే! - Salman Khan Kick 2 Movie - SALMAN KHAN KICK 2 MOVIE

Salman Khan Kick 2 Movie : సల్మాన్ ఖాన్ బ్లాక్​బస్టర్ మూవీస్​లో ఒకటైన 'కిక్​' చిత్రానికి త్వరలో సీక్వెల్​ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ను తాజాగా మేకర్స్ వెల్లడించారు.

Salman Khan Kick 2 Movie
Salman Khan (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 12:58 PM IST

Salman Khan Kick 2 Movie : బాలీవుడ్ కండల వీరుడు షారుక్ ఖాన్ నటించిన బ్లాక్​బస్టర్ మూవీస్​లో 'కిక్​'ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్​తో పాటు కాసుల వర్షం కురిపించింది. అయితే అప్పట్లో ఈ చిత్రానికి సీక్వెల్​ విడుదల కానున్నట్లు ప్రకటించినప్పటికీ అది రూమర్స్​గానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఆ రూమర్స్ నిజం కానున్నట్లు మేకర్సే ఓ స్పెషల్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు. కండల వీరుడి సూపర్ ఫొటో షూట్​తో 'కిక్​ 2' అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు.

స్టార్ నిర్మాత సాజిద్‌ నడియాద్వాలా తాజాగా సల్మాన్​కు సంబంధించిన బ్లాక్​ అండ్ వైట్​ ఫొటోను షేర్ చేసి 'ఇది ఓ గ్రేట్ కిక్​ 2 ఫొటోషూట్​ సికందర్' అంటూ క్యాప్షన్​ను జోడించారు. చూస్తుంటే ఈ సారి మొదటి పార్ట్ కంటే సీక్వెల్​లో ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో సమంత కూడా నటిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ మేకర్స్ ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు.

ఇదిలా ఉండగా, 2009లో రవితేజ హీరోగా నటించిన 'కిక్‌' రీమేక్​గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్​ను షేక్ చేసింది. అయితే ఒరిజినల్ సినిమాలోని కొన్ని సీన్స్​ను బీటౌన్​ అభిమానులకు తగ్గట్లుగా మార్చి తెరకెక్కించడం వల్ల అక్కడి వారు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. సల్మాన్‌ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాడెంజ్‌ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.

యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రూ.140 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ దీనిని నిర్మించగా, అది రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్లిందని ట్రేడ్ వర్గాల మాట.

ఇక సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం 'సికందర్‌' అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ ఎ.ఆర్‌.మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక ఇందులో ఫీమేల్ లీడ్​గా మెరవనుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఆ రోల్ చేసేందుకు అందరూ నో- సల్మాన్ మాత్రం ఒక్క రూపాయి రెమ్యునరేషన్​కే! - Salman Khan 1 Rupee Remuneration

వెబ్​సిరీస్​లో కలిసి నటించనున్న షారుక్​, సల్మాన్! - Salman Khan Sharukh Khan Webseries

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.