SalmanKhan Slapped Ranbir Kapoor : బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ గురించి తెలిసిందే. వివాదాలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటారు. అయితే బీటౌన్ లో రణబీర్ కపూర్ కూడా సల్మాన్ లాగే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఇద్దరివి ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాలే. అయినా సరే ఒకానొక సందర్భంలో రణబీర్ పై సల్మాన్ చేయి చేసుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
అసలేం జరిగిందంటే ? - గతంలో చాలా ఏళ్ల కిందట ఓ పబ్‌లో సల్మాన్ ఖాన్ - రణ్‌బీర్ కలుసుకున్నారట. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్పష్టంగా ఏం జరిగిందో తెలీదు కానీ మాట మాట పెరిగి సల్మాన్ రణబీర్‌ను చెంప మీద కొట్టే స్థాయికి వెళ్లిపోయిందని ఇంగ్లీష్ కథనాల్లో రాసి ఉంది. ఈ గొడవలోకి సంజయ్ దత్ సహా మరికొందరు ఫ్రెండ్స్ కలుగ చేసుకుని ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారట. అందరి ముందు సల్మాన్ తనపై చేయి చేసుకోవడం అవమానంగా భావించిన రణబీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ తర్వాతి రోజు ఉదయం సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ ఇంటికి వెళ్లి సల్మాన్ తరఫున క్షమాపణ కోరారని ఆ కథనాల్లో రాసి ఉంది. అయితే ఈ సంఘటన ఇప్పటిది కాదని, రణబీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే జరిగిందని ఆ వార్తల్లో ఉంది.
స్పందించిన సల్మాన్ - అయితే ఈ సంఘటనపై ఆప్ కీ అదాలత్ ప్రోగ్రాంలో సల్మాన్ ఖాన్ స్పష్టత ఇచ్చారు." మీరు ఓ రెస్టారెంట్లో రణ్‌బీర్ కపూర్‌ను కొట్టారట, బెదిరించారట" అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఈ విషయాన్ని తెలిపారు. "నేను అలా చేయలేదు. ఎప్పటికీ నా వల్ల అలా జరగకూడదని అనుకుంటున్నాను" అని క్లారిటీ ఇచ్చారు.
"కానీ మీరు అతడి డ్రెస్ స్లీవ్స్‌ను పట్టుకున్నారట. అక్కడ ఉన్న వాళ్లు చెప్పారు" అని మరో ప్రశ్న అడగగా - "లేదు నేను అతడి చేయి పట్టుకుని దారి చూపించాను" అని సరదాగా బదులిచ్చారు. "నిజానికి ఏమైందంటే అతడి టీషర్ట్ మీద ట్యాగ్ ఉంది. నేను సరదాగా దానిని లాగేసి ఏడిపించాను. అప్పుడే సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చి అతడు రిషీ కపూర్ కొడుకు అని చెప్పాడు. ఓ అవునా అని అనుకున్నాను." అని సల్మాన్ చెప్పుకొచ్చారు.
కాగా, 2007లో సావరియా చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు రణబీర్. ఆ తర్వాత 2009లో విడుదలైన అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ చిత్రంలో కత్రినా కైఫ్‌తో కలిసి నటించారు. ఆమెతో కలిసి డేటింగ్ కూడా చేశారు. అయితే అప్పటికే కత్రినా సల్మాన్ తో బ్రేక్ అప్ చెప్పేసింది.
ఇకపోతే సల్మాన్ ఖాన్ గత ఏడాది నటించిన కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపర్చింది. పఠాన్‌తో ఆయన చేసిన అతిథి పాత్ర మాత్రం ఆకట్టుకుంది. ఇక టైగర్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు బాగానే సాధించినా రొటీన్ యాక్షన్ ఫిల్మ్ కావడం వలన ఆడియెన్స్‌కు పెద్దగా నచ్చలేదు. ఇక రణబీర్ యానిమల్తో బ్లాక్ బస్టర్ అందుకుని తన మార్కెట్ స్థాయిని పెంచుకున్నారు. ప్రస్తుతం రామాయణ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
కాల్పులకు భయపడి సల్మాన్ ఖాన్ ఇల్లు మారుతున్నారా? - అసలు విషయం ఇదే - salman khan shoot out case
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సంచలనానికి 50 ఏళ్లు - తెర వెనక విశేషాలివే! - Alluri Sitaramaraju