Salaar Streaming In Netflix Top 10 : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్' అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా (నాన్ ఇంగ్లీష్)ల్లో సలార్ టాప్- 10లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. పాన్ఇండియా సినిమా కాస్త గ్లోబల్ మూవీగా మారిందంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఓటీటీలో విడుదలైన 5 రోజులకే ఈ ఘనతను సాధించడం విశేషం.
నాన్-ఇంగ్లిష్ కేటగిరీలో టాప్-10లో సలార్ స్ట్రీమింగ్
- టాప్-1లో- సలార్(తెలుగు)
- టాప్-2లో- సలార్(తమిళం)
- టాప్-5లో- సలార్(కన్నడ)
- టాప్-7లో- సలార్(మలయాళం)
-
Devaratha Raisaar took over @NetflixIndia’s trending list 💥https://t.co/BwiclqCjzu#SalaarTopsOnNetflix #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/eZUN6RMMr7
— Hombale Films (@hombalefilms) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Devaratha Raisaar took over @NetflixIndia’s trending list 💥https://t.co/BwiclqCjzu#SalaarTopsOnNetflix #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/eZUN6RMMr7
— Hombale Films (@hombalefilms) January 22, 2024Devaratha Raisaar took over @NetflixIndia’s trending list 💥https://t.co/BwiclqCjzu#SalaarTopsOnNetflix #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/eZUN6RMMr7
— Hombale Films (@hombalefilms) January 22, 2024
-
One voice, 4 languages, same goosebumps !!🥶#Salaar is now streaming on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada. pic.twitter.com/piq0eVx5TD
— Netflix India South (@Netflix_INSouth) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">One voice, 4 languages, same goosebumps !!🥶#Salaar is now streaming on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada. pic.twitter.com/piq0eVx5TD
— Netflix India South (@Netflix_INSouth) January 22, 2024One voice, 4 languages, same goosebumps !!🥶#Salaar is now streaming on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada. pic.twitter.com/piq0eVx5TD
— Netflix India South (@Netflix_INSouth) January 22, 2024
-
త్వరలో ఇంగ్లిష్‌లోనూ?
గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో తెలుగు, హిందీ సహా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది 'సలార్'. కానీ, ఓటీటీలో మాత్రం సలార్-హిందీ వెర్షన్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇక ఇప్పుడు ఓటీటీ టాప్-10లో వివిధ లాంగ్వేజస్‌లో సలార్ స్ట్రీమ్ అవుతుండడం వల్ల హిందీలోనూ ఎప్పుడు రిలీజవుతుందోనని ఎదురుచూస్తున్నారు నార్త్ ఇండియన్స్. అలాగే 'సలార్' సినిమాను త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్లోనూ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Salaar Cast: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్, జగపతిబాబు, ఝాన్సీ, శ్రేయా రెడ్డి, సప్తగిరి, శ్రుతిహాసన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ మ్యుజిక్ కంపోజ్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరాగందుర్ నిర్మించారు.
Salaar Part- 2 Update: ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడం వల్ల ఫ్యాన్స్ అంతా రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెకెండ్ పార్ట్ షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసి 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ మూవీ తర్వాత సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌కు రెడీ అయ్యేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్‌తో కలిసి కల్కి 2898 AD సినిమా చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీరియల్ టు కొరియన్ ఫిల్మ్- తొలి నటిగా 'అనుష్క' రికార్డ్
నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ - స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు!