Salaar 2 Shooting : గతేడాది విడుదలైన 'సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం దేశమంతటే కాకుండా ఓవర్సీస్లోనూ పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా 'సలార్: శౌర్యంగపర్వం'ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం చివరిలో ఈ విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో రెండో భాగం గురించి అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. అస్సలు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పార్ట్-2కు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన కీలక స్క్రిప్ట్ వర్క్ తాజాగా పూర్తయిందట. దీంతో మే నెల చివరి వారం కల్లా మేకర్స్ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తొలి పార్ట్‌కు వచ్చిన మాసివ్ రెస్పాన్స్‌ను బేస్ చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ కథకు మరిన్ని మెరుగులు దిద్ది శౌర్యంగపర్వం సిద్ధం చేశారట.
ఇక సలార్- 2 సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే మొదలుపెట్టనున్నారట. 10 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు, ఇందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తర్వాత సన్నివేశాలను బెంగళూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. అసలైన కథ మొదలయ్యే పార్ట్ 2లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉండనున్నాయి. ఎన్నో సస్పెన్స్‌లతో ముగించిన సలార్ పార్ట్-1కు ఈ సీక్వెల్లో సమాధానాలు దొరకున్నాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ డిసెంబరు 2023న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. గ్లోబల్ బాక్సాఫీసు రికార్డుల ప్రకారం.. సినిమా రూ.500 కోట్ల వసూలు చేసింది. దీనికి సీక్వెల్ అయిన సలార్-2లో, కథ మొత్తం రాజకీయం నేపథ్యంలో కొనసాగుతుందట. ప్రభాస్, పృథ్వీరాజ్ లు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చిందనే అంశంపైనే చిత్రం పూర్తిగా ఉంటుందట.
ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్- 'సలార్ 2'కు బ్రేక్- ఆ స్టార్ హీరో కోసమేనట! - Salaar Part 2 Postponed
సలార్ 2లో ఆమె 'గేమ్‌ఛేంజర్' కాదట - అదంతా ఫేక్! - Prabhas Salaar 2