ETV Bharat / entertainment

మొటిమలకు సాయి పల్లవి సర్జరీ - ఆమె సమాధానమిదే! - Saipallavi Pimples - SAIPALLAVI PIMPLES

SaiPallavi Comments on Pimples Surgery : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకుందా? తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది సాయిపల్లవి. ఏం చెప్పిందంటే?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 1:46 PM IST

SaiPallavi Comments on Pimples Surgery : సాయిపల్లవి అనగానే గుర్తొచ్చేది మొదట సగటు అమ్మాయిలా సహజంగా కనిపించే ముఖం, వంకీలు తిరిగిన ఒత్తైన ఉంగరాల జుట్టు. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో పరిచయమైన సాయిపల్లవి. తెలుగులో ఫిదాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజమైన అందంతోనే కాదు సహజ నటనతో అభిమానులను సంపాదించుకుంది.

ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో శారీరిక అందం గురించి మాట్లాడింది సాయి పల్లవి. తాను ప్రేమమ్ సినిమా చేస్తున్నప్పుడు ముఖంపై మొటిమలు ఎక్కువ ఉండేవి అని, నిజానికి అందులో అవకాశం రావడానికి కారణం కూడా ఆ మొటిమలే అని చెప్పింది. టీనేజీ నుంచి ఒక వయసు వచ్చేవరకు అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమే అని, వాటి కోసం ఎటువంటి చికిత్సా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎలాంటి మొటిమలు లేవని వాటిని పొగట్టడానికి ఎటువంటి చికిత్సా తను తీసుకోలేదని పేర్కొంది. ఆరోగ్యకరమైన ఒత్తైన పొడుగాటి జుట్టుకు కారణం తను ఎక్కువగా ఆర్గానిక్ ఆహార పదార్థాలను ఉపయోగించడం వలనే అంటూ తన అందమైన జుట్టు రహస్యాన్ని కూడా తెలిపింది.

ఆధ్యాత్మిక యాత్రలతో పాటు తన సిస్టర్ పెళ్లితో చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది సాయిపల్లవి. ప్రస్తుతం తండేల్ మూవీలో నాగ చైతన్య సరసన హీరోయిన్​గా నటిస్తుంది సాయిపల్లవి. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో రెండోసారి వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక ఫిల్మ్​కు సైన్ చేసింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ కాశ్మీర్​లో జరిగిన ఒక సెర్చ్ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పేరు అమరన్. ఈ ఫిల్మ్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. బాలీవుడ్​లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న మహారాజా మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం జపాన్​లో జరుగుతోంది. అలానే రణబీర్​తో పాన్ ఇండియా ఫిల్మ్ రామాయణలో సీతగా నటిస్తోంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్​కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

స్క్రీన్​కు దూరమై ఆరేళ్లైనా క్రేజ్ అస్సలు తగ్గలే - షారుక్​,సల్మాన్​లనే మించేసిందిగా - Happy Birthday Anushka Sharma

కాలేజీ ఫెస్ట్​లో 'షీలా కీ జవానీ' సాంగ్​కు సాయిపల్లవి డ్యాన్స్​ - స్టేజ్ షేకే! - Saipallavi Sheila Ki jawani Dance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.