ETV Bharat / entertainment

పేరు మార్చుకున్న మెగా హీరో - తల్లి కోసం చెర్రీ స్పెషల్ గిఫ్ట్​ - Sai Dharam Tej New Name

Sai Dharam Tej New Name : మెగా హీరో సాయి ధరమ్​ తేజ్​ తాజాగా తన పేరును మార్చుకున్నట్లు వెల్లడించారు. ఇంతకీ ఆయన కొత్త పేరు ఏంటంటే ?

Sai Dharam Tej New Name
Sai Dharam Tej New Name
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 9:46 AM IST

Updated : Mar 9, 2024, 10:32 AM IST

Sai Dharam Tej New Name : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా తన పేరు మార్చుకున్నారు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని ఆయన సాయి దుర్గ తేజ్​గా మారిపోయారు. ఇలా ఆమె ఎప్పుడూ తనతో ఉన్నట్లుంటుందని అలా చేసినట్లు పేర్కొన్నారు. ఉమెన్స్​ డే సందర్భంగా నిర్వహించిన 'సత్య' ప్రెస్​మీట్​లో తేజ్ ఈ ఆసక్తికరవిషయాలను పంచుకున్నారు.

ఇవాల నుంచి నా పేరులో మా అమ్మ పేరును యాడ్ చేసుకున్నాను. ఇంటి పేరు కింద మా నాన్న పేరు ఎలాగో ఉంటుంది. మా అమ్మ కూడా నాతోనే ఉండాలి. అందుకే మా అమ్మ పేరును నా పేరులో కలుపుకున్నాను. 'సాయి దుర్గ తేజ్' గా మార్చుకున్నాను" అంటూ తేజు తెలియజేశారు.

అంతే కాకుండా నిర్మాణ సంస్థను నెలకొల్పాలన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందంటూ, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ అనే పేరు పెట్టానన్నాంటూ ఇదే వేదికగా వెల్లడించారు. ఇది విన్న ఫ్యాన్స ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'తల్లి కోసం పేరు మార్చుకున్నారు. మీరు గ్రేట్' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ గతంలోనూ తన స్క్రీన్ నేమ్‌ను 'సాయి తేజ్‌'గా మార్చుకున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఆయన్ను అసలు పేరుతోనే పిలుస్తుంటారు.

తల్లి కోసం చెర్రీ స్వీటెస్ట్ గిప్ట్​
Ram Charan Cooking : మరోవైపు ఉమెన్స్ డే సందర్భంగా రామ్​చరణ్​ కూడా తన తల్లి సురేఖకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తన తల్లితో కిచెన్​లో వంట చేస్తూ కనిపించారు. ఇక ఏం వంట చేస్తున్నారని అడగ్గా, 'మా అమ్మ కోసం పన్నీర్ టిక్కా వండుతున్నా' అంటూ క్యూట్​గా రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు సూపర్ రెస్పాన్స్​ వస్తోంది. ఇది చూసి చెర్రీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తల్లి కోసం ఈ మెగా హీరోలు చేస్తున్న పనులు ఇప్పుడు క్యూట్​ ఫ్యామిలీ గోల్స్​గా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Ganja Shankar Movie : సుప్రీం హీరో 'గాంజా శంకర్' గ్లింప్స్​ ఔట్.. 'లోకల్​ మ్యాన్'​గా పక్కా మాస్​లుక్​లో సాయిధరమ్ తేజ్!

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే?

Last Updated : Mar 9, 2024, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.