Sabari Movie New Song : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో త్వరలో రానున్న పాన్ ఇండియా మూవీ 'శబరి'. ఇటీవలే విడుదలైన 'నా చెయ్యి పట్టుకోవే' అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'అనగనగా ఒక కథలా' అనే మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదగా ఈ పాట విడుదలైంది. విశేషం ఏంటంటే ఈ పాటకు చంద్రబోస్ సతీమణి సుచిత్రా చంద్రబోస్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.
''ఇప్పుడే నేను 'శబరి' సినిమాలోని 'అనగనగా ఒక కథలా' అనే పాటను రిలీజ్ చేశాను. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. విడుదల కంటే ముందే నేను ఈ సాంగ్‌ను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నాను. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు, పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించాను. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా'' అంటూ చంద్రబోస్ మాట్లాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. డైరెక్టర్ అనిల్ కాట్జ్ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న విడుదల కానుంది.
సెలైంట్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ - కాబోయే మొగుడు ఎవరంటే?
బిగ్‌బాస్ శివాజీ కొత్త సినిమా అనౌన్స్మెంట్ - 'కూర్మ నాయకి'తో రీఎంట్రీ