ETV Bharat / entertainment

పవన్​ అందుకే 'ఖుషి' సీక్వెల్ ఒప్పుకోలేదు - అసలు కారణం చెప్పిన ఎస్​ జే సూర్య - SJ SURYAH Kushi SEQUEL - SJ SURYAH KUSHI SEQUEL

S. J. Suryah Kushi Sequel : సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎస్‌జే సూర్య ఖుషి 2పై స్పందించారు. పవన్​ ఎందుకు ఈ సినిమా చేయనని చెప్పారో వివరించారు.

source ETV Bharat and ANI
pawan kalyan S. J. Suryah (source ETV Bharat and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 10:45 AM IST

Updated : Aug 28, 2024, 11:06 AM IST

S. J. Suryah Kushi Sequel : పవన్ కల్యాణ్, భూమిక నటించిన ఖుషీ అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమాను సినీ ప్రియులు ఆదరిస్తూనే ఉన్నారు. 2001లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. రీ రిలీజ్​లోనూ మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. దీంతో ఖుషీకి కూడా సీక్వెల్ వస్తే బాగుండని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. తాజాగా దీనిపై సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎస్‌జే సూర్య స్పందించారు.

హీరోయిన్ ప్రియాంక - "ఖుషి 2 ఎప్పుడు చేస్తున్నారు? అందులో పవన్ ఉంటారా? లేదా మరో హీరోనా?" అని అడగగా సూర్య ఈ విధంగా బదులిచ్చారు. "ఖుషీ 2 అనే ఓ స్టోరీ ఇప్పటికే పవన్ గారి దగ్గర ఉంది. వేరే పేరు పెట్టి ఓ స్టోరీ నేను ఆయనకు చెప్పాను. చాలా మంచి స్టోరీ అది. ఆయన ఆ స్టోరీ విని చాలా ఎంజాయ్ చేశారు. 'స్టోరీ బాగుంది. కానీ నేను ఆ స్టేజ్ నుంచి దాటిపోయాను. ఇప్పుడు లవ్​ చేయడం వంటివి వద్దు. ఈ సమయంలో లవ్ స్టోరీలు చేయడం బాగుండదు' అని నాతో అన్నారు. ఇక్కడ ఎన్టీఆర్, అక్కడ ఎంజీఆర్ పెద్ద, సీనియర్​ హీరోలు అయ్యాక కూడా లవ్ స్టోరీలు చేశారని వివరించాను. అయినా పవన్​ వద్దని చెప్పారు. జరిగి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నాకు ఆ బాధ ఉంది. ఇంకా ఈ కథను నాని, రామ్​చరణ్, విజయ్ కూడా చేయొచ్చు. ముగ్గురికి ఈ కథ సరిపోతుంది​" అని సూర్య చెప్పుకొచ్చారు.

మరి హీరోయిన్ ఎవరు అని ప్రియాంక మళ్లీ అడగగా, అదీ అసలు సంగతి అని పక్కనే ఉన్న హీరో నాని నవ్వుతూ అన్నారు. అప్పుడు ఈ కథ కచ్చితంగా ప్రియాంకాకు సెట్ అవుతుంది అని సూర్య బదులిచ్చారు. అంటే మొత్తానికి 'ఖుషీ 2' చేయాలని సూర్యకు ఆలోచన ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ దానికి సిద్ధంగా లేరని క్లారిటీ అయింది.

'పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేసుకుంటారు?' - నాగ చైతన్య సమాధానమిదే - Naga chaitanya Marriage

పికిల్‌ బాల్‌ గేమ్‌ ఆడిన సమంత - ఈ ముద్దుగుమ్మ ఎనర్జీ, ఫిట్​నెస్​కు ఫ్యాన్స్ ఫిదా! - Samantha World Pickleball League

Last Updated : Aug 28, 2024, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.