ETV Bharat / entertainment

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ పాటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్​! - RRR Rajamouli Alia Bhatt

దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాటను ఆ స్టార్ హీరోయిన్ ఇంకా పాటిస్తూనే ఉందట. జక్కన్న చెప్పిన మాటతో తన పద్ధతిని మార్చుకుందట. ఇంతకీ జక్కన్న చెప్పిన మాట ఏంటి? ఆ బడా కథానాయిక ఎవరు? ఏంటి అనేది తెలుసుకుందాం.

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ క్రమం తప్పకుండా పాటిస్తున్న స్టార్ హీరోయిన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 4:38 PM IST

Updated : Mar 14, 2024, 6:32 PM IST

RRR Rajamouli Alia Bhatt : తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ అనగానే ఏమాత్రం ఆలోచించకుండా టక్కున గుర్తొచ్చే పేరు దర్శకధీరుడు రాజమౌళి. ఆయనతో కలిసి సినిమా చేసేందుకు ఇండియా వైడ్​గా ఉన్న స్టార్ యాక్టర్స్​ అంతా ఎంతో ఆశపడుతుంటారు. ఎందుకంటే జక్కన్నతో సినిమా చేస్తే ఏ హీరో లేదా హీరోయిన్​ అయినా వరల్డ్ వైడ్​గా టాప్​ రేంజ్​కు వెళ్లాల్సిందే. అయితే జక్కన్న ఓ స్టార్ హీరోయిన్​కు సినిమాల ఎంపిక విషయంలో ఓ సలహా ఇచ్చారంట. దాన్ని ఇప్పటికీ ఆ స్టార్ హీరోయిన్ పాటిస్తూనే ఉందట. ఆ విషయాన్ని తాజాగా తనే స్వయంగా చెప్పింది.

ఇంతకీ ఆమె ఎవరంటే? బాలీవుడ్ బడా కథానాయిక అలియా భట్. తాజాగా ఓ ఈవెంట్​లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన అడ్వైస్​ను షేర్ చేసుకుంది. "సినిమాలను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఫస్ట్ నుంచి నేను ఒత్తిడికి గురౌతుంటాను. ఇదే విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పాను. అప్పుడు ఆయన ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు మూవీ రిజల్ట్​ ఎలా ఉన్నా ఆడియెన్స్​ మాత్రం కచ్చితంగా మీ యాక్టింగ్​ను ప్రశంసిస్తారు. మీకు పక్కాగా కనెక్ట్‌ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది మరేమీ లేదు అని చెప్పారు. అప్పటి నుంచి దాన్నే కంటిన్యూస్​గా పాటిస్తున్నాను. పరిశ్రమలోకి వచ్చిన కెరీర్ ప్రారంభంలో నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథకు ఓకే చెప్పేదాన్ని. వాస్తవంగా చెప్పాలంటే నాకు సహనం చాలా తక్కువ. ఇప్పుడు అది మారింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతటి కష్ట పాత్రనైనా చేయాలని డిసైడ్ అయ్యాను" అని అలియా చెప్పుకొచ్చింది.

కాగా, అలియా భట్​ - రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్​ఆర్​ఆర్​లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్ర పోషించి అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో జిగ్రా అనే సినిమాలో నటించింది. వాసన్‌ బాలా డెరెక్ట్ చేస్తున్నారు. కరణ్‌ జోహార్‌ కూడా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 27న రిలీజ్ కానున్నట్లు తెలిసింది.

దటీజ్​ రాజమౌళి - ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయిన జక్కన్న సినిమా తెలుసా?

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

Last Updated : Mar 14, 2024, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.