RRR Movie JR NTR Tiger Fight Sequence : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ ముందు రికార్డులు సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. ఆస్కార్ రేంజ్‌కు ఎదిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పులి వెనక పరిగెత్తే సీన్ ఆ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. పులిని వెంబడించడం, ఆ తర్వాత పులిని బంధించడం సీన్స్‌లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే తాజాగా ఆ సీక్వెన్స్ గురించి, షూటింగ్ సమయంలో జరిగిన సంఘటల్ని గురించి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ చెప్పారు.
"ఆ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్లో ఆయన మొదట నక్కను, తోడేలును ఆ తర్వాత పులిని వెంబడించాలి. దానికి తగినట్లుగా ఏ దారిలో పరిగెత్తాలో ఎన్టీఆర్‌కు మేము ముందే చెప్పాము. అప్పుడే మా కష్టాలు మొదలయ్యాయి యాక్షన్ అని చెప్పగానే తారక్ చాలా వేగంగా పరిగెత్తేవారు. అతని వేగం వల్ల ఆ సీన్‌ను కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా కష్టమైంది. మొదట ఆయన అంత వేగంగా ఎలా పరిగెత్తగలుగుతున్నారు అని మాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌ను అడిగిన తర్వాత మాకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని దాని కారణంగానే అంత వేగంగా పరిగెడుతున్నారని తెలిసింది. అయితే చేసేది ఏమిలేక అతని వేగానికి సరిపోయేలా మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం" అంటూ అప్పటి విశేషాలు చెప్పుకొచ్చారు సెంథిల్.
ఇదే విషయం ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "జంతువులు అన్ని VFX ద్వారా క్రియేట్ చేసినా వాటికన్నా వేగంగా పరిగెత్తాలని జక్కన్న గో గో గో అని అరిచేవారు. బయట ఎలా ఉన్నా సినిమా విషయంలో మాత్రం నటీనటులతో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఈ మూవీ ఇం టర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయడానికి దాదాపు 65 రాత్రులు కష్టపడ్డాం. దాని కోసం బల్గెరియా అడవుల్లో 12 రోజుల పాటు పరిగెత్తడం కోసం నన్ను ఇన్స్పైర్ చేయడం కోసం రకరకాల జంతువులు ఎంత వేగంగా పరిగెడతాయో వివరించి చెప్పేవారు రాజమౌళి. అవే అంత వేగంగా పరిగెడితే నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో చూడు అనేవారు" అని అన్నారు ఎన్టీఆర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహేశ్, రాజమౌళి సినిమా - వాటిని నమ్మకండి - SSMB29 Movie
సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్ శంకర్ వార్నింగ్! - Harish Shankar Chota K Naidu