ETV Bharat / entertainment

యశ్‌ 'టాక్సిక్‌' షూటింగ్ అప్డేట్​ - మూవీ ఎన్ని భాగాలుగా రానుందంటే? - Yash 19 Toxic - YASH 19 TOXIC

Rocking Star Yash 19 toxic shooting : యశ్ 'టాక్సిక్‌'​ సినిమా షూటింగ్​కు సంబంధించిన అప్డేట్​ బయటకు వచ్చింది. అదేంటంటే?

ANI
Yash (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 2:30 PM IST

Updated : May 3, 2024, 3:27 PM IST

Rocking Star Yash 19 toxic shooting : రాకింగ్ స్టార్​ యశ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్‌ అనౌన్స్ చేసి చాలా రోజుల అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏప్డేట్ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ చిత్రం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. రీసెంట్​గా ఈ చిత్రంలోని హీరోయిన్ల గురించి పలు వార్తలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారని తెలిసింది. ప్రస్తుతం కర్ణాటకలో శరవేగంగా జరుగుతోన్నట్లు సమాచారం అందింది. ఈ చిత్రాన్ని కూడా కేజీయఫ్​ తరహాలో రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రానుంది.

ఇక టాక్సిక్ విషయానికి వస్తే - భారతదేశంలోని తీర ప్రాంతాల్లో జరిగే అక్రమ మాదక ద్రవ్యాల రవాణా ఆధారంగా 'టాక్సిక్' చిత్రం తెరకెక్కనున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాగే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. వీటితో పాటు కియారా అద్వానీ, శ్రుతి హాసన్ కూడా యశ్​ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వీటన్నింటి గురించీ 'టాక్సిక్' చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇందులో ఏది నిజమో, ఏది పుకారో తెలియాలంటే 'టాక్సిక్' యూనిట్ నుంచి అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే.

ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేయనున్నారట. మొదటి షెడ్యూల్​ లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో భారీ సెట్లు, చాలా మంది టెక్నికల్ టీమ్స్​ను కూడా సిద్ధం చేశారట. అలాగే షూటింగ్ పరిసరాల్లో సౌకర్యాల విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ కోసం వేసే భారీ సెట్లు, సాంకేతికత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఉపాధి దొరకనుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

వీకెండ్ స్పెషల్ - రెండు రోజుల గ్యాప్​లో OTTలోకి 10 క్రేజీ సినిమాలు! - This Week OTT Releases

ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది - నిర్మాతలపై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! - Sonali Bendre

Last Updated : May 3, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.