ETV Bharat / entertainment

పవన్ విషయంలో అతడిపై రేణూ దేశాయ్ ఫుల్​​ ఫైర్​! - Renu Desai Pawankalyan - RENU DESAI PAWANKALYAN

Renu desai Fire on Netizen : పవన్ కల్యాణ్​ విషయంలో అతడిపై రేణూ దేశాయ్​ ఫుల్ ఫైర్ అయింది. ఏం జరిగిందంటే?

Source ETV Bharat
pawan kalyan Renudesai (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 4:04 PM IST

Renu desai Fire on Netizen : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రేణు జంతు సంరక్షణ కోసం విరాళాల సేకరణ బాధ్యత తీసుకున్నారు. రీసెంట్​గా ఆ విషయమై చేసిన పోస్ట్ మీద ఒక నెటిజన్ 'మా పవన్ కల్యాణ్​ అన్నలా గోల్డెన్ హర్ట్' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో తాను పెట్టే ప్రతీ పోస్ట్‌పై స్పందిస్తూ ఎప్పుడూ తన మాజీ భర్త పవన్​ కల్యాణ్​తో పోలుస్తారెందుకు? అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఆ కామెంట్​పై రేణూ స్పందిస్తూ “పదేళ్ల వయసు నుంచే జంతు సంరక్షణ కోసం పనిచేస్తున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. జంతువులపై నేను చూపించేంత ప్రేమ, ఇష్టం ఆయనకు లేవు. దయచేసి నేను చేసిన పనుల గురించి పోస్ట్ పెట్టిన ప్రతిసారి ఆయన ప్రస్తావన తీసుకురావద్దు. నన్ను ఆయన మాజీ భార్యగా కాకుండా నన్నుగా చూడండి” అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఇదే విషయమై మరో పోస్ట్ చేస్తూ ఆ కామెంట్​కు బాధగా అనిపించి అలా సమాధానమిచ్చానని కానీ కోపంతో ఆ మాటలు అనలేదని చెప్పింది.

అసలేం జరిగిందంటే? - రేణు దేశాయ్ ఇటీవల తన ఇన్​స్టాగ్రామ్​లో ఒక క్యూ ఆర్ కోడ్​తో 3,500 రూపాయలు జంతు సంరక్షణ కోసం విరాళంగా కావాలని పోస్ట్ చేయడం వైరల్​గా మారింది. దీంతో కొందరు రేణు అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే మళ్లీ ఆమె స్వయంగా వీడియో ఒకటి పోస్ట్ చేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో వీడియో రూపంలో విరాళం అడగలేకపోయానని అంతేగానీ తన అకౌంట్ ఎవరూ హ్యాక్ చేయలేదని సృష్టం చేసింది. తాను జంతు సంరక్షణ కోసం విరాళాల సేకరణ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పలువురు ఆమెను ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్​ 'మా పవన్ కల్యాణ్​ అన్నలా గోల్డెన్ హర్ట్' అంటూ కామెంట్ చేశాడు.

కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు - 24 రోజుల తర్వాత ఇంటికి! - Actor Gurucharan Singh

కూతురు కోసం రూ.200 కోట్లు ఖర్చు - మళ్లీ అతడితోనే కలిసి పనిచేయనున్న షారుక్! - Sharukh Khan Anirudh Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.