ETV Bharat / entertainment

'వాళ్ల నాన్న కోసం నా పిల్లలు ఇలా రెడీ అయ్యారు' - రేణూ దేశాయ్ ఎమోషనల్ - Renu Desai Instagram Post - RENU DESAI INSTAGRAM POST

Renu Desai Instagram Post : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఏంగా ప్రమాణ స్వీకారం చేశారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్​. ఇక పవన్​తో పాటు ఆ ఆనందంలో భాగమయ్యేందుకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవీ, రామ్​చరణ్​, పవన్ సతీమణి అన్నా ఇలా పలువురు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా ఈ ప్రత్యేక వేడుక కోసం వచ్చారు. ఈ విషయాన్నీ నటి రేణూ దేశాయ్​ తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు.

PAWAN KALYAN OATH CEREMONY
RENU DESAI INSTAGRAM STORY (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 1:22 PM IST

Updated : Jun 12, 2024, 2:18 PM IST

Renu Desai Instagram Post : ఆంధ్ర ప్రదేశ్​కు నాల్గవ ముఖ్యమంత్రిగా నేడు (జూన్ 12) ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా కేసరపల్లి వేదికగా జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు కేబినెట్​ మంత్రులు కూడా తమ పదవీ బాధ్యతలను అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్​గా జరిగింది. ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం వేడుకకు హైలైట్​గా నిలిచింది.

డిప్యూటీ సీఎంగా పవన్​ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆ ఆనందంలో భాగమయ్యేందుకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవీ, రామ్​చరణ్​, పవన్ సతీమణి అన్నా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా ఈ ప్రత్యేక వేడుక కోసం వచ్చారు.

ఇక అకిరా, ఆద్య ఇద్దరూ ఎంతో చక్కగా రెడీ అయి ఈ వేడుకకు వచ్చారు. అకిరా పట్టు పంచె కట్టుకుని ఆకట్టుకోగా, ఆద్య కూడా ట్రెడిషనల్ డ్రెస్​లో ముద్దుగా కనిపించింది. అయితే ప్రమాణ స్వీకారానికి ముందు వాళ్లు తమ తల్లి రేణు దేశాయ్​కి వీడియో కాల్ చేసారు. ఆమెకు తమ కొత్త డ్రెస్​ చూపించి మురిసిపోయారు. ఇక రేణూ కూడా దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్​కు విషెస్ తెలిపారు.

"నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ స్టేట్​కి, ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నాను" అంటూ పవన్​కు కంగ్రాజ్యూలేషన్స్​ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

చిరుకు పాదాభివందనం
మరోవైపు ఇదే ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మంత్రిగా ప్రమాణం చేసిన వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తన అన్నయ్య చిరంజీవి వద్దకు వెళ్లి పవన్ పాదాభివందనం చేశారు. దీన్ని చూసిన అభిమానులు ఎమోషనలయ్యారు.

మోదీతో అకీరా - ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనంటూ రేణు దేశాయ్ పోస్ట్ - RENU DESAI POST ON AKIRA MEETING MODI

పవన్​ కల్యాణ్​ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్​ - Pawankalyan Renudesai

Last Updated : Jun 12, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.