ETV Bharat / entertainment

చరణ్, సుక్కు మూవీ - ఆ ఐదు నిమిషాలు లీక్ చేసిన రాజమౌళి - Rajamouli RC 17 - RAJAMOULI RC 17

RC 17 Rajamouli : రామ్​చరణ్​ - సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ గురించి ఓ అప్డేట్​ను లీక్​ చేశారు రాజమౌళి. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 2:02 PM IST

RC 17 Rajamouli : రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్​లో వచ్చిన రంగస్థలం ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిన విషయమే. రామ్ చరణ్​లోని అసలు నటుడు అప్పుడే బయటకు వచ్చాడని ప్రేక్షకుల అభిప్రాయం కూడా. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతటా దీని గురించే చర్చ నడుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలో రాజమౌళి ఈ మూవీ గురించి మాట్లాడిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాజమౌళి RC17 సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో వచ్చే మొదటి ఐదు నిమిషాలు ప్రేక్షకుడి కళ్లు చెదిరిపోయేలా ఉంటాయని అన్నారు. థియేటర్​లో సీటుకు ప్రేక్షకులు అతుక్కుపోతారని చెప్పారు. ఆ వీడియోలో రాజమౌళి ఇలా చెపుతుంటే రామ్ చరణ్ కూడా అంతే ఉత్సాహంగా నవ్వుతూ ఆ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశారు.

మరోవైపు ఈ సినిమాపై జక్కన్న తనయుడు కార్తికేయ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ షూటింగ్ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెప్పడం, ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించడం, అది ఐదు నిమిషాల పాటు అద్భుతంగా ఉంటుందని చెప్పడం వంటివి చూపించారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి మార్చి 25న ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. సుకుమార్, రామ్ చరణ్ రంగులు పూసుకుంటున్న ఫోటోతో పాటు రెండు గుర్రాలు ఉన్న పోస్టర్​ను కూడా షేర్ చేసింది. వీరిద్దరి మొదటి సినిమాను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్సే. సంగీతం అందించింది దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు పనిచేసిన టీం మొత్తం ఈ సినిమాకు రిపీట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ సినిమా రంగస్థలంకు మించి సక్సెస్ సాధిస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.

కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్​లో బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ కూడా పాన్ ఇండియా హిట్ అయిన పుష్ప సినిమా రెండో భాగం పుష్ప 2 షూటింగ్​లో బిజీగా ఉన్నారు. గేమ్​ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ RC16 సినిమా కోసం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో పని చేయనున్నారు.

ఓం భీమ్​ బుష్​ - బాక్సాఫీస్​ ముందు ఊతకొట్టుడే! - OM BHEEM BUSH COLLECTIONS

కృష్ణ - నగ్మాల మధ్య బికినీ తెచ్చిన తంట - ఈ వివాదం తెలుసా? - Nagma Bikini controversy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.