ETV Bharat / entertainment

ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్ - 'వారందరికీ థ్యాంక్స్' - Raviteja Dishcarged - RAVITEJA DISHCARGED

Raviteja Dishcarged : గాయం కారణంగా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టాలీవుడ్ నటుడు రవితేజ తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అభిమానులను తెలియజేసేందుకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

Raviteja Dishcarged
Raviteja (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 2:41 PM IST

Raviteja Discharged : గాయం కారణంగా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టాలీవుడ్ నటుడు రవితేజ తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అభిమానులను తెలియజేసేందుకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

"ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్​లు పంపిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నేను మళ్లీ షూటింగ్​లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ పోస్ట్‌ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ 'గెట్​ వెల్ సూన్ అన్న' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏమైందంటే?
హీరో రవితేజ ప్రస్తుతం '#RT75' అనే వర్కింగ్ టైటిల్​తో తెరక్కెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగానే గురువారం షూట్ జరుగుతున్న సమంలో రవితేజకు గాయమైంది. ఇక రవితేజ గాయపడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్​ ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

ఇక '#RT 75' విషయానికి వస్తే, ఇందులో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుండగా, ఈ మూవీతోనే రచయిత భాను భోగవరపు డైరెక్టర్​గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల మాట.

మిస్టర్ బచ్చన్ టాక్ ఎలా నడిచిందంటే?
ఇదిలా ఉండగా, తాజాగా రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్​తో నడుస్తోంది. అయితే తొలి రోజు మాత్రం డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది. ప్రీమియర్స్ కలిపి దేశవ్యాప్తంగా రూ.5.3 కోట్ల నెట్​ కలెక్షన్ చెసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా ఇది.

నటన పరంగా రవితేజ అదరగొట్టినప్పటికీ సినిమా ఆశించినస్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో పాటు బాక్సాఫీస్ ముందుకొచ్చిన రామ్, పూరి డబుల్ ఇస్మార్ట్ కూడా మిక్స్​డ్​ టాక్​తో సరిపెట్టుకుంది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతోనే వచ్చినప్పటికీ అభిమానులను మెప్పించలేకపోయాయి.

మెట్రోలో 'మిస్టర్ బచ్చన్' ప్రమోషన్స్​- ప్యాసింజర్లకు​ సర్​ప్రైజ్​- ఎంతైనా రవితేజ స్టైలే వేరు - Mr Bachchan Promotions

'ఓవర్ చేయకు'- హరీశ్ శంకర్​కు రవితేజ స్వీట్ వార్నింగ్! - Ravi Teja Harish Shankar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.