ETV Bharat / entertainment

'నాకంటే ట్యాలెంటడ్ వాళ్లు ఉన్నారు- అవకాశాలు కొందరికే దక్కుతాయి' - Rashmika Mandanna Latest Interview - RASHMIKA MANDANNA LATEST INTERVIEW

Rashmika Mandanna Latest Interview : వరుస విజయాలు అందుకుంటూ జోష్‌ మీద ఉన్న యంగ్ బ్యూటీ రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు మాట్లాడారు. తాను విజయాలను పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చింది. దానికి గల కారణం ఎంటంటే ?

Rashmika Mandanna Latest Interview
Rashmika Mandanna Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 3:36 PM IST

Rashmika Mandanna Latest Interview : 'పుష్ప' సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు నేషనల్ క్రష్​గా ఉన్న ఆమె ఇప్పుుడు గ్లోబల్​ ఫేవరట్​గా మారింది. తన యాక్టింగ్​కూ ఓవర్సీస్​లోనూ మంచి క్రేజ్ ఉంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుని అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా విడుదలైన యానిమల్ కూడా ఆమెకు మాసివ్ సక్సెస్​ను అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ అండ్ ఫేమ్​ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను ఈ విజయాలను పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది.

"నాకంటే అందమైన, తెలివైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకూ సూపర్ ట్యాలెంట్ ఉంది. అయితే మనల్ని మనం నిరూపించుకునే అవకాశాలు అతి కొద్దిమందికే వస్తుంది. నాకు కూడా అలాంటి అవకాశాలు వచ్చాయి కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్​కు చేరుకున్నాను. నన్ను గుర్తించిన డైరెక్టర్​, ప్రొడ్యూసర్స్​కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అయితే కెరీర్‌లో సాధించిన సక్సెస్​ను, అలాగే ఎదుర్కొన్న ఫేయిల్యూర్స్​ను పట్టించుకోకూడదు. ఏ ఫీల్డ్​లోనైనా అవి కామనే. ఇటీవలే ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. మనం చేసే ప్రతీ పనిని ఆడియెన్స్ బాగా గమనిస్తారు. ప్రశంసలు, విమర్శలు లాంటివి కూడా మనకు ఎదురవుతాయి. కానీ వాటి గురించి ఆలోచిస్తే మనం మానసికంగా కుంగిపోతాం. జీవితంలో ఇక ముందుకు సాగలేం. అందుకే వాటిని నేను అస్సలు పట్టించుకోను" అని చెప్పారు.

ఇక రష్మిక మూవీస్​ విషయానికి వస్తే- రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ధనుశ్ నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న 'డీ 51' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు రెండూ శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్నాయి. ఇక 'పుష్ప' ఈ ఏడాది ఆగస్ట్​ 15 థియేటర్లలోకి రానుండగా, ధనుశ్​ మూవీ మాత్రం తమ సినిమా టైటిల్​తో పాటు ఈ చిత్రం గురించి మరిన్ని అప్​డేట్స్​ ఇవ్వాల్సి ఉంది.

ఈ రెండింటితో పాటు 'చిలసౌ' ఫేమ్​ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న 'ద గర్ల్​ఫ్రెండ్​' లో ఆమె లీడ్​ రోల్​ పోషిస్తోంది. టీజర్​ చూస్తే ఇది లేడీ ఓరియెంటెడ్​ సినిమాలా అనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమె లైనప్​లో 'రెయిన్‌ బో' అనే సినిమా కూడా ఉంది.

రష్మిక సాధించిన ఈ 6 రికార్డులు తెలుసా? - అన్నింటిలోనూ నెం.1 - Rashmika Birthday

రష్మిక లగ్జరీ లైఫ్​ - లగ్జరీ ఇళ్లు, కార్లతో పాటు ఎన్ని కోట్లు సంపాదించిందంటే? - Happy Birthday Rashmika Mandanna

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.