ETV Bharat / entertainment

'సెట్స్​లో ఆయన అలా బిహేవ్ చేసేవారు - నేను అన్నీ చెప్తాను' - Rashmika Mandanna Animal Movie - RASHMIKA MANDANNA ANIMAL MOVIE

Rashmika Mandanna Animal Movie : రష్మిక మందన్నా, రణ్​బీర్ కపూర్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన సూహర్ హిట్ మూవీ యానిమల్​. ఈ సినిమాలో ఈ ఇద్దరి నటనకు అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా రణ్​బీర్ కపూర్ ప్రవర్తన గురించి నెగిటివిటీ వచ్చింది. అయితే ఇదే విషయంపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

Rashmika Mandanna Animal Movie
Rashmika Mandanna Animal Movie (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 7:48 PM IST

Rashmika Mandanna Animal Movie : సందీప్ రెడ్డి వంగా డైరక్షన్‌లో వచ్చిన 'యానిమల్' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కమర్షియల్‌గానూ, కథ పరంగానూ మంచి సక్సెస్ సాధించింది ఈ మూవీ. ఇదంతా ఓ వైపు. మరోవైపు ఈ సినిమాలోని రణ్​బీర్ క్యారెక్టర్​ గురించి విభిన్న కామెంట్లు వచ్చాయి. ఆ పాత్ర చిత్రీకరణ ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రణ్​బీర్ ఇటువంటి పాత్రలో నటించి అభిమానులను అలానే చేయమని ప్రేరేపిస్తున్నారంటూ నెగిటివిటీ పాకింది.

అంతే కాకుండా సినిమాలోనే రణ్​బీర్ ఇలా ఉన్నారంటే, సెట్స్​లోనూ మిగతావారితోనూ ఇలాగే మర్యాద లేకుండా ఉంటారంటూ రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. దీంతో ఈ విషయంపై యానిమల్ హీరోయిన్, రష్మీక మందన్న స్పందించారు.

"రణ్​బీర్‌ సెట్స్‌లో మహిళల పట్ల మర్యాద పూర్వకంగా మెలగడమే తనలో నాకు బాగా నచ్చే గుణం. నాకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, నేను చేయలేను అనిపించినా నేరుగా వెళ్లి ఆయనకు చెప్పేస్తాను. అదెలాంటిదైనా సరే, దానికి ఆయన 'అలా ఎలా నో చెప్తావ్​ ప్రపంచంలో ఎలాంటి పనైనా నువ్వు చేయగలవు' అంటూ ధైర్యం చెప్తారు. అతని స్వభావం ఎలాంటిదంటే సెట్​లోని మిగిలిన మహిళలతో కూడా అతను ఒకే మాట అంటుంటారు. లేడీస్ మీలో చాలా పవర్ ఉంది. వెళ్లండి మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి" అని ప్రోత్సహిస్తుంటారని పేర్కొంది.

ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో 'పుష్ప ది రూల్'లో నటిస్తోంది. ఆగస్ట్​ 15న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు ధనుశ్​ శేఖర్ కమ్ముల కాంబినేషన్​లో వస్తున్న 'కుబేరా' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. రాహుల్ రవీంద్ర తెరకెక్కిస్తున్న 'ది గర్ల్​ఫ్రెండ్'​ అనే లేడీ ఓరియెంటడ్ చిత్రంలోనూ మెరవనుంది.

సౌత్​లోనే కాకుండా బీటౌన్​లోనూ రెండు ప్రతిష్టాత్మక సినిమాల్లోనూ నటిస్తోంది. సల్మాన్ ఖాన్ మురగదాస్ కాంబోలో రూపొందుతున్న 'సికందర్'తో పాటు 'చావా' అనే హిస్టారికల్ డ్రామాలో విక్కీ కౌశల్ సరసన నటిస్తోంది. దీంతో వరుస షెడ్యూల్స్​లో బిజీగా ఉంది ఈ చిన్నది.

సల్మాన్​ భాయ్​తో రష్మిక - మరో భారీ ప్రాజెక్ట్ ఛాన్స్​ కొట్టేసిన నేషనల్ క్రష్​ - Rashmika Salman khan

'నాకంటే ట్యాలెంటడ్ వాళ్లు ఉన్నారు- అవకాశాలు కొందరికే దక్కుతాయి' - Rashmika Mandanna Latest Interview

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.