ETV Bharat / entertainment

కళ్లు చెదిరిపోయాయి వర్మ - 53ఏళ్ల వయసులో రమ్యకృష్ణ అందం వేరే లెవల్​! - Ramya Krishna photoshoot - RAMYA KRISHNA PHOTOSHOOT

Ramya Krishna Photoshoot : సీనియర్ నటి రమ్యకృష్ణ 50 ఏళ్లు దాటినా ఎంతో అందంగా కనిపిస్తూ ఇప్పటికీ కుర్రాళ్లను కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య ఆమె తన గ్లామర్​ను ఒలకబోస్తూ అదిరిపోయే రేంజ్​లో ఫొటోషూట్స్ వీడియోస్ చేశారు. అవి మీరు చూశారా?

Ramya Krishna Glamour Photoshoot Videos
jRamya Krishna Glamour Photoshoot Videos
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 7:54 AM IST

Updated : Mar 25, 2024, 11:38 AM IST

Ramya Krishna Photoshoot : సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్​గా ఓ వెలుగు వెలిగింది. పొగరున్న పట్నం పిల్లగా, కన్నీళ్లు పెట్టించే కూతురిగా, మత్తెక్కించే ఐటెం గర్ల్‌గా, హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా కూడా ఎన్నో పాత్రలు చేసి అభిమానుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె సినిమాలు చేసింది. కెరీర్​లో దాదాపుగా 260కుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది.

రమ్యకృష్ణ మొదట తన 14వ ఏటనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1984లో తమిళంలో వేల్లై మనసు, తెలుగులో భలే మిత్రులు చిత్రాలతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు మొదట ఆశించిన స్థాయిలో హీరోయిన్​గా గుర్తింపు రాలేదు. దాదాపు ఐదేళ్ల పాటు సక్సెస్​ లేకుండానే ఇండస్ట్రీలో రాణించింది. సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. అయితే కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులుతో తొలి హిట్​ను అందుకుంది. అందులో తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావుతో చేసిన అల్లుడుగారు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు సినిమాలతో రొమాంటిక్‌ హీరోయిన్‌ అయిపోయింది. అనంతరం ఎన్నో హిట్ చిత్రాల్లో ప్రియురాలిగా, భార్యగా, హై క్లాస్‌ భామగా ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్​లను దక్కించుకుంది.

ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్​లోనూ దుసుకెళ్తోంది. టీవీ సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి ఆకట్టుకుంటోంది. రీసెంట్​గా మహేశ్​ బాబు గుంటూరు కారం(Ramya Krishna Gunturu kaaram) చిత్రంతో ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే 50 ఏళ్లు దాటినా ఈమె అందం మాత్రం చెక్కు చదరట్లేదు. ఎంతో అందంగా కనిపిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే తన అందాన్ని ఒలకబోస్తూ గ్లామర్ ఫొటోస్, వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు కళ్లు చెదిరిపోయాయి వర్మ, ఓ మై గాడ్​, గార్జియస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సిటాడెల్​ - షూటింగ్​ సెట్​లో కళ్లు తిరిగిపడిపోయిన సమంత! - Samantha myositis

ఓం భీమ్ బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే! - Ayesha Khan

Last Updated : Mar 25, 2024, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.