ETV Bharat / entertainment

చరణ్ విషయంలో చిరు అలాంటి కామెంట్స్‌ - షాకైన ఉపాసన! - Ramcharan Upasana - RAMCHARAN UPASANA

Ramcharan Upasana : రామ్‌ చరణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్‌ విని ఉపాసన షాక్ అయిందట! ఈ విషయాన్ని స్వయంగా చరణ్ తెలిపారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat and ANI
Chiranjeevi Ramcharan Upasana (source ETV Bharat and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 9:21 PM IST

Chiranjeevi about Ramcharan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ లైఫ్‌లో పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన, కూతురు క్లీంకారనే ఆయన ప్రపంచం. ఉపాసన కూడా మెగా ఫ్యామిలీలో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత నుంచి, చరణ్‌తో పాటు సమానంగా ఆ కుటుంబంపై అంతే అభిమానం చూపిస్తున్నారు. అయితే ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గురించి చిరంజీవి చేసిన కామెంట్ విని ఉపాసన షాక్ అయిపోయిందట.

అదెప్పుడంటే - ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డు వేడుకకు హాజరయ్యారు. తన సహ నటుడైన జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకకు విచ్చేశారు. ఆ సమయంలో చెర్రీ ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. దీంతో పాటే తన తండ్రి చిరంజీవి లుక్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటారనే విషయాన్ని రివీల్ చేశారు.

Ramcharan Upasana : "మా నాన్న 41 సంవత్సరాలుగా యాక్టర్‌గా రాణిస్తున్నారు. ఆయనకు కచ్చితంగా షేప్ గురించి ఒక అభిప్రాయం ఉంటుంది. కొన్నిసార్లు అది చాలా కరెక్ట్‌గా ఉంటుంది కూడా. ఒకసారి నా భార్య అది విని ఆశ్చర్యపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అంతా భోజనం చేస్తున్నాం. అప్పుడు ఆయన 'నువ్వు కాస్త బరువు తగ్గినట్లున్నావ్' అన్నారు. దానికి నేను 'అవును డాడ్' అని చెప్పా. వెంటనే 'ఒరేయ్ ఇడియట్, నేను చెప్పేది నువ్వు బరువు పెరుగుతున్నావని, తగ్గావని కాదు. ఏం చేస్తున్నావ్, జిమ్‌కు వెళ్లకుండా' అని తిట్టిపారేశారు. వెంటనే నా భార్య ఉపాసన 'అది ఫిజికల్‌గా కించపరిచినట్లే కదా' అని అడిగింది. అప్పుడు దానికి నేను 'యాక్టర్లు అలాగే మాట్లాడుకుంటారు' అని సర్ది చెప్పా" అని ఆ సందర్భాన్ని వివరించారు.

ఇంకా మాట్లాడుతూ - "నేను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రాకముందే చదువు పూర్తి చేయాలని మా నాన్న అనేవారు. కానీ, చివరికి ఆయనే రియలైజ్ అయ్యారు. నేను చదువులో అంత గొప్పగా ఏం ఉండేవాడిని కాదు. మా కాలేజీ డీన్ మా నాన్న గారికి 'మీ వాడి టైం, నా టైం వేస్ట్ చేయకండి. అతనికి ఇంట్రెస్ట్‌ ఉన్న చోట చేర్పించండి' అని చెప్పేశారు. అప్పుడే మా నాన్న రియలైజ్ అయి యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ చేశారు. అలా నా సినీ ప్రయాణం మొదలైంది" అని చరణ్ వివరించారు.

ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇది పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

వరద బాధితుల కోసం టాలీవుడ్‌ కీలక నిర్ణయం - Tollywood Producers

'ఆ డైరెక్టర్‌ నన్ను శృంగార బానిసగా చూశాడు' : నటి సంచలన ఆరోపణలు - Hema Committee Report

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.