Ramayana Movie Yash : బీటౌన్‌లో తెరకెక్కుతున్న 'రామయణ' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే గతంలో రణ్‌బీర్, సాయి పల్లవికి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ బయటకి రావడం వల్ల మేకర్స్ కూడా చాలా జాగ్రత్తపతుడున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు అన్నీ సీక్రెట్‌గా ఉండాలని భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలో యశ్ పాత్ర గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంట్లో రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కోసం మేకర్స్ భారీ సన్నాహాలే చేస్తున్నారట. తన పాత్రకు సంబంధించిన చిన్న డీటైలింగ్ కూడా గ్రాండ్‌గా ఉండాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే తాను ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీంటినీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం.
రావణుడు స్వర్ణ నగరమైన లంకాపురికి రాజు. అప్పట్లో ఆయన ధరించిన వస్త్రాలు కూడా బంగారుతో తయారుచేసినవని ఇతిహాసాల్లోనూ పేర్కొంది. అందుకే ఈ సినిమాలోనూ రావణుడి పాత్రను అలాగే చూపించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇది విన్న ఫ్యాన్స్ ఓకింత షాకైనప్పటికీ, మేకర్స్ ఆలోచన విధానానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. పలువురు యశ్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో యశ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రణ్‌బీర్, సాయి పల్లవితో పాటు యశ్ కూడా షూట్లో పాల్గొన్నారని సమాచారం. హనుమంతుడిగా సన్నీ దేఓల్ కనిపించనున్నారు. ఆయన కూడా ఈ సినిమా చిత్రీకరణకు వచ్చారట.
మరోవైపు ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.835 కోట్లు అని నెట్టింట టాక్ నడుస్తోంది. అది కూడా కేవలం తొలి భాగాన్ని తెరకెక్కించడం కోసమేనట. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 2025లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు అది కాస్త 2027కి షిష్ట్ అయ్యిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ చిత్రం దాదాపు 600 రోజులకుపైగానే షూటింగ్ జరుపుకుంటుంది.
ఇండియన్ సినిమాలో అత్యంత కాస్ట్లీగా 'రామాయణ్' - ఒక్క భాగానికే రూ.835కోట్లా? - Ramayan Movie