ETV Bharat / entertainment

'రామాయణ్' షూటింగ్ - సెట్స్​లో సాయిపల్లవి రణ్​బీర్ కపూర్ సందడి - Ramayan Movie Shooting - RAMAYAN MOVIE SHOOTING

Ramayan Movie Shooting : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ్​' సినిమా గురించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. సెట్స్​లో తీసిన పలు ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Ramayan Movie Shooting
Ramayan Movie Shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 1:08 PM IST

Ramayan Movie Shooting : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ్​ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే రణ్​బీర్ కపూర్, సాయి పల్లవి కూడా సినిమా షూటింగ్​లో పాల్గొన్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ నిజమే అంటూ పలు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అందులో రణ్​బీర్ సాయి పల్లవి రాముడు, సీత వేషధారణలో కనిపించారు.దీంతో ఈ ఇద్దరూ రామయణంలో భాగమని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు.

అయితే ఇప్పటి వరకు మేకర్స్ ఈ సినిమా గురించి బయట ఎటువంటి అనౌన్స్​మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారన్న విషయం గురించి కూడా అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. షూటింగ్​ కూడా సైలెంట్​గానే మొదలుపెట్టారు. అప్పట్లో ఈ సినిమా గురించి కీలక అప్​డేట్​ను విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ మూవీ టీమ్​ స్పందించి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పణఖగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్​ కనిపించనున్నట్లు పలు రూమర్స్ నెలలుగా నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీంతో పాటు వీరి రెమ్యూనరేష్​ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది.

ఇదిలా ఉండగా, లక్ష్మణుడి పాత్రలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కనిపించున్నారని సమాచారం. కానీ ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉండటం వల్ల ఈ విషయం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని తెలుస్తోంది. అయితే లక్ష్మణుడి పాత్ర కోసం హిందీ సీరియల్ నటుడు రవి దూబే పేరు కూడా వినిపిస్తోంది.

ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యశ్ కీలక పాత్ర పోషించడంతో పాటు కో ప్రొడ్యూసర్​గా కూడా వ్యవహరించనున్నారట. నమిత్ మల్హోత్రా కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్​తో యశ్ స్థాపించిన కంపెనీ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

నమిత్ మల్హోత్రా DNEGకు గ్లోబల్ సీఈవో కూడా. ఈ సినిమాను నిర్మించాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ఇప్పటికీ నితీశ్​ తివారి ద్వారా నెరవేరబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రణ్​బీర్ కపూర్ అత్యధికంగా రూ.250 కోట్లు రెమ్యునరేషన్, సాయిపల్లవి రూ.20కోట్లు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రణ్​బీర్, సాయి పల్లవి రెమ్యూనరేషన్- రామాయణ్​కు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా? - Ramayana Ranbir Kapoor

రామాయణం మొదలు - యశ్, రణ్​బీర్ సెట్​లోకి జాయిన్​ అయ్యేది అప్పుడే! - Ramayana Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.