Chiranjeevi Family At Paris Olympics : పారిస్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. ఆయన తన భార్య సురేఖ, తనయుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి ఈ మెగా ఈవెంట్లో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చిరు కూడా ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని ఫొటో దిగారు. దాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
Absolutely thrilled to attend the inaugural of the #PARIS2024 #Olympics
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 27, 2024
A delightful moment holding the Olympic Torch replica along with Surekha !
Wishing each and every player of our proud Indian Contingent, All the Very Best and the Best Medal Tally ever!
Go India!!🇮🇳 Jai… pic.twitter.com/fjFWvf9csO
Global SUPERSTAR #RamCharan at the #ParisOlympics 🔥🔥🔥 pic.twitter.com/6lDTAWuo3n
— CineHub (@Its_CineHub) July 27, 2024
MegaFamily at Paris Olympic Games OpeningCeremony on a short vacation. #MegaFamily #Paris2024 #Olympics #OpeningCeremony #RamCharan #Chiranjivi pic.twitter.com/504OW9xb5L
— ᏰᏗᏝᏗ (@balakoteswar) July 27, 2024
మరోవైపు చిరు ఇటీవలే 'విశ్వంభర' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో కలిసి పారిస్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన ముద్దుల మనవరాలితో కలిసి వెకేషన్ టైమ్‌ను గడుపుతున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన స్పెషల్ ఫొటోలు అలాగే వీడియోలను చరణ్ అలాగే ఉపాసన తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా వారందరూ కలిసి పారిస్ వీధుల్లో సరదాగా తిరిగిన ఓ వీడియోను ఉపాసన షేర్ చేశారు. అలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
PARIS OLYMPICS 2024 OPENING CEREMONY : పారిస్ వేదికగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై 6,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రేక్షకులు ఈవెంట్‌ను వీక్షించేందుకు హాజరవ్వగా, వారికోసం నది పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తుల్లో - ఈ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు భారతదేశ పతాకధారులుగా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడ్డారు. వీళ్ల వెనకాలే మన అథ్లెట్ల పడవ ప్రయాణం సాగింది. వీరంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మెరిశారు. మహిళలు త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన చీరను కట్టుకోగా, పురుషులు కుర్తా, పైజామాను ధరించి ఆకట్టుకున్నారు. మొత్తంగా భారత బృందం తరఫున 78 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
'విశ్వంభర' లేటెస్ట్ అప్డేట్ - ఫుల్ హ్యాపీ మోడ్‌లో మెగా ఫ్యాన్స్! - Chiranjeevi Viswambara
రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం - 'నాటునాటు'కు రెడీ అవ్వండి ఫ్యాన్స్