Rakul Jacky Wedding Card : బీటౌన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన చిరకాల ప్రియుడు బాలీవుడ్ స్టార్ జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 21న ఆమె వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గోవా వేదికగా జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారట.
అయితే తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. అట్రాక్టివ్ కలర్స్‌తో సింపుల్‌గా ఉన్న ఆ కార్డులో పెళ్లి ముహూర్తం రాసుంది. కవర్‌పై ఓ వైపు రకుల్ అండ్ జాకీ అని రాసుండగా, మరోవైపు అబ్ దోనో భాగ్నా - నీ ( ఇక ఇద్దరు ఎక్కడికి పరిగెట్టద్దు అని అర్థం, దీంతో పాటు జాకీ భాగ్నానీ సర్ నేమ్‌ను కూడా ఇందులో మెన్షన్ అయ్యింది) అనే హ్యాష్ ట్యాగ్‌ను ప్రింట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ వీళ్ల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ చాలా కొత్తగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
మూడు రోజుల పెళ్లి - ముగ్గురు డిజైనర్లు
Rakul Jacky Wedding Designers : మరోవైపు ఈ జంట పెళ్లి దుస్తుల డిజైనర్లను కూడా లాక్ చేశారు. మూడు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుక కోసం రోజుకో డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని ఈ ఇద్దరూ వేసుకోనున్నారట. మనీశ్ మల్హోత్రా, తరుణ్ తహిల్యానీ, సబ్యసాచి లాంటి స్టార్ డిజైనర్స్ ఈ పెళ్లి దుస్తులను రెడీ చేయనున్నారట.
Rakul Jacky Wedding Venue : తొలుత రకుల్- జాకీ తమ వివాహాన్ని మిడిల్ ఈస్ట్‌లో ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పలు ప్రదేశాలను కూడా సెలక్ట్ చేశారు. అయితే, గత డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తమ ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. అలా చివరి నిమిషంలో పెళ్లి వేదికను మార్చారని సమాచారం.
వెడ్డింగ్ డెస్టినేషన్‌లో మార్పులు - ఆయన కోసమే రకుల్, జాకీ నిర్ణయం!
పెళ్లిపీటలెక్కబోతున్న రకుల్‌ప్రీత్ సింగ్!- వరుడెవరో తెలుసా?