Rajnikanth Bollywood Movie : రజనీకాంత్. ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన సినిమాలంటే ఇక నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ఎదురుచూస్తుంటారు. ఆయన స్టైల్, మేజరిజాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమాల్లో చూపించిన డైరెక్టర్లు ఉన్నారు. రజనీకాంత్ కంటే ఈయన్ను తలైవా అంటేనే అభిమానులకు అదో తృప్తి. తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో తెలుగు, తమిళంలో దాదాపు 169 సినిమాలు చేశారు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాల్లో తన స్వాగ్‌ను చూపిస్తున్నారు.
రజనీ సౌత్‌కే పరితమవ్వలేదు. ఆయన నార్త్‌లోనూ పలు సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే బీటౌన్‌లో తన కెరీర్‌ను కొనసాగిద్దమనుకుంటున్న సమయంలో ఓ సినిమా ఆయన బాలీవుడ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేలా చేసింది. ఇంతకీ అదేంటంటే ?
సూపర్ స్టార్ రజనీకాంత్, బీటౌన్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కాంబినేషన్లో 1995లో వచ్చిన మూవీ 'ఆతంక్ హీ ఆతంక్'. హాలీవుడ్ మూవీ 'గాడ్‌ఫాదర్'ని ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్ దిలీప్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన బడ్జెట్ రెండు కోట్లు అయితే కలెక్షన్ దానికి రెండు కోట్ల అదనంగా వచ్చిందట. దీంతో ఈ సినిమా హిట్ టాక్ అందుకోలేకపోయింది. అదేడాది అమిర్ ఖాన్ నటించిన 'రాజా హిందూస్థానీ', 'రంగీలా' సినిమాలు రూ. 20కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో అనుహ్యంగా ఈ మూవీ టీమ్‌కు చేదు అనుభవం మిగిలింది.
అప్పటికే 'హమ్', 'చాల్ బాజ్' వంటి సినిమాలతో రజనీ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ 'ఆతంక్ హీ ఆతంక్' సినిమా రిజల్ట్ వల్ బీటౌన్‌లో రజనీ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లు అయ్యింది. దీంతో క్రమక్రమంగా ఈ స్టార్ హీరో హిందీ సినిమాలకు దూరమయ్యారు. అయితే 2000లో వచ్చిన 'బులందీ' అనే సినిమాలో మాత్రం ఆయన అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2011లో విడుదలైన షారుక్ ఖాన్ 'రా.వన్' లోనూ గెస్ట్‌గానే కనిపించారు.
రజనీ 'లాల్ సలామ్' షాకింగ్ కలెక్షన్స్ - మరీ ఇంత దారుణంగా!
లారెన్స్ జర్నీలో ఎన్నో కష్టాలు - రజనీకాంత్ వల్లే అలా మారారట!