Rajinikanth Vettaiyan Movie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వేట్టయాన్ : ది హంటర్ ఇటీవలే థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు అందుకుంటోంది. 'జై భీమ్' ఫేమ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ రూపొందించిన ఈ చిత్రం అటు మాస్‌తో ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ముఖ్యంగా ఇందులో రజనీ సరికొత్త యాక్షన్ మూవ్స్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు డైరెక్టర్ జ్ఞానవేల్. ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"వేట్టయన్ ది హంటర్ చిత్రంలో దాదాపు అతియాన్ (రజనీకాంత్) గురించే ఉంటుంది. అయితే ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎలా మారారన్న కథను నేను ప్రీక్వెల్‌తో చెప్పాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం ఇటువంటి పలు ఇంట్రెస్టింగ్ అంశాలకు బ్యాక్‌స్టోరీ చెప్పాలని ఉంది. అందుకే ఈ సినిమాకు ప్రీక్వెల్ చేసేందుకు ఎక్కువ ఆసక్తితో ఉన్నాను" అంటూ జ్ఞానవేల్ పేర్కొన్నారు. అలాగే ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి నవంబరు ఫస్ట్ వీక్‌లో అనౌన్స్ చేస్తానని అన్నారు.
స్టోరీ ఏంటంటే?
అథియన్ (రజనీకాంత్) ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. నిజాయతీతో పాటు ధైర్యం ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆయన ఏమాత్రం వెనకాడడు. అటువంటి వ్యక్తిని శరణ్య (దుశారా విజయన్) అనే ఓ స్కూల్ టీచర్ హత్య కలచి వేస్తుంది. ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడం వల్ల ప్రభుత్వం, పోలీసు అధికారులపైనా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియాన్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆయన ఈ కేసు బాధ్యతల్ని తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని మట్టు బెడతాడు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి? మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ ఎన్‌కౌంటర్‌ని ఎందుకు తప్పుపట్టాడు? ఆ కేసుని మళ్లీ పరిశోధించాల్సిన అవసరం అథియాన్‌కు ఎందుకు వచ్చింది? అసలీ శరణ్య హత్య వెనక ఎవరున్నారు? అథియాన్‌కీ, బ్యాటరీ (ఫహాద్ ఫాజిల్) నటరాజ్ (రానా దగ్గుబాటి )కీ ఉన్న సంబంధమేమిటి? ఇటువంటి అంశాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
సూట్లో సూపర్ స్టార్స్ - రజనీ, అమితాబ్ లుక్ అదుర్స్ - Rajinikanth Vettaiyan Movie