ETV Bharat / entertainment

పవర్​ ఫుల్​గా 'లాల్ సలామ్' ట్రైలర్​ - రజనీ యాక్షన్​ అదిరిపోయిందంతే! - రజనీకాంత్ లాల్​ సలామ్​ రిలీజ్

Rajinikanth Lal Salaam Trailer : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్​ సలామ్'​ ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా సాగింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం రజినీకాంత్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. రజనీ పాత్ర ఎంతో పవర్​ ఫుల్​గా కనిపిస్తోంది.

పవర్​ ఫుల్​గా 'లాల్ సలామ్' ట్రైలర్​ - రజనీ యాక్షన్​ అదిరిపోయిందంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 6:45 AM IST

Updated : Feb 6, 2024, 8:07 AM IST

Rajinikanth Lal Salaam Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్‌ 'జైలర్' సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపులో వరుస సినిమాలను లైన్​లో పెట్టారు. ఇందులో భాగంగానే ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' అనే చిత్రంలోనూ నటించారు. ఈ మూవీ మరో మూడు రోజుల్లో(ఫిబ్రవరి 9) విడుదల కానుంది. అయితే ఈ చిత్రం గురించి పెద్దగా ఎక్కడా వినపడట్లేదు. ఈ నేపథ్యంలో మూవీటీమ్​ ప్రమోషన్స్​లో జోరు పెంచింది. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి ట్రైలర్​ను(Lal Salaam Trailer) విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా సాగింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం రజినీకాంత్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. మెయినుద్దీన్ భాయ్​గా రజనీ పాత్ర ఎంతో పవర్​ ఫుల్​గా కనిపిస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్​ రోల్ కాదు. స్పెషల్ క్యామియో అయినప్పటికీ కథలో ఎంతో కీలకంగా ఉండే పాత్ర అని తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth)​ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. గతంలో రజనీ కాంత్ వాయిస్ ఓవర్​తో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీని కూడా రూపొందించింది ఐశ్వర్య. ఇప్పుడు తొలిసారిగా తన తండ్రిని డైరెక్ట్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, చిత్రంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ గెస్ట్​ రోల్​లో కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. రెడ్ గైయింట్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. ఆస్కార్ విన్నర్​ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తలైవర్ స్పెషల్ అట్రాక్షన్​గా రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.

అప్పుడే నిర్ణయించుకున్నా అలా చేయకూడదని : రజనీకాంత్‌

నిమిషానికి కోటిన్నర - 'లాల్​ సలామ్'​ రజనీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Last Updated : Feb 6, 2024, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.