ETV Bharat / entertainment

కూలీ సినిమా ఆగిపోలేదు - షూటింగ్ మొదలయ్యేది ఆ రోజే : లోకేశ్​ - Rajinikanth Coolie Movie - RAJINIKANTH COOLIE MOVIE

Rajinikanth Coolie Movie : సూపర్​స్టార్ రజనీకాంత్​, స్టార్​ డైరెక్టర్ లోకేశ్​ కనగ‌రాజ్ కాంబినేషన్​లో రూపొందుతున్న 'కూలీ' సినిమా గురించి ఓ సూపర్ అప్డేట్​ను డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్ రివీల్ చేశారు. ఇంతకీ అదేంటంటే?

RAJINIKANTH COOLIE MOVIE
RAJINIKANTH (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 7:28 PM IST

Rajinikanth Coolie Movie : కోలీవుడ్ సూపర్​స్టార్ రజనీకాంత్​, స్టార్​ డైరెక్టర్ లోకేశ్​ కనగ‌రాజ్ కాంబినేషన్​లో రూపొందుతున్న లేటెస్ట్​ పాన్ ఇండియా మూవీ 'కూలీ'. 'తలైవర్ 171'గా ప్రతిష్టాత్మకంగా రానున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికై టైటిల్​ రివీల్​ వీడియోతో పాటు రజనీ న్యూ లుక్​కు సంబంధించిన పోస్టర్​, అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది.

అయితే టైటిల్​ అనౌన్స్​మెంట్​ తర్వాత ఎటువంటి అనౌన్స్​మెంట్స్ కూడా రాకపోవడం వల్ల రజనీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ సినిమా అసలు సెట్స్​పైకి వెళ్తుందా లేదా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయని నెటిజన్లు చర్చించుకోవడం మొదలెట్టారు. అయితే తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ ఫుల్​స్టాప్​ పెట్టేలా ఓ స్పెషల్​ పోస్ట్​ను షేర్ చేశారు డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్​.

షూటింగ్ స్పాట్​లో రజనీతో తీసుకున్న ఓ మిర్రర్ సెల్ఫీనీ పోస్ట్ చేసి 'కూలీ కోసం లుక్ టెస్ట్​. జులై నుంచి ఈ మూవీ షూటింగ్​ ప్రారంభం'​ అంటూ ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో సూపర్​స్టార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. "సినిమా షూటింగ్​​ త్వరగా స్టార్ట్​ చేయండి డైరెక్టర్ సార్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఇందులో తలైవర్ లుక్ మరింత కొత్తగా ఉండనుంది అంటూ ఎగ్జైట్​మెంట్​ వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్‌ సినిమా తరహాలో తెరకెక్కనుందని, ఇందులో టాలీవుడ్​ స్టార్ హీరో నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని కోలీవుడ్​లో టాక్ నడుస్తోంది. అలాగే ఇందులో రజనీకాంత్‌కి కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. అంతేేకాకుండా మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా ఈ చిత్రంలో ఇంపార్టెంట్​ రోల్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై మేకర్స్ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్​ చేయలేదు. దీంతో రజనీ అభిమానులు 'కూలీ' నుంచి మరి కొన్ని అప్డేట్స్​ కావాలంటూ కోరుతున్నారు.

తలైవా 171 లేటెస్ట్ బజ్- రజనీ సినిమాలో టాలీవుడ్ 'కింగ్'! - Thalaivar 171

రజనీ, సల్మాన్‌ కాంబోలో మల్టీస్టారర్‌! - దర్శకుడు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.