ETV Bharat / entertainment

మహేశ్, రాజమౌళి సినిమా ఎక్కడి దాకా వచ్చిందంటే? - SSMB 29 Movie - SSMB 29 MOVIE

SSMB 29 Release Date : రాజమౌళి - మహేశ్​ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూ మూవీపై అంచనాలను పెంచుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఎక్కడి వరకు వచ్చిందంటే?

Source ETV Bharat
mahesh rajamouli (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 9:40 AM IST

SSMB 29 Release Date : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్​ బాబు గత ఏడాది గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మిక్స్​డ్​ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించేలా వసూలు చేసింది.

అయితే మహేశ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం కోసం మహేశ్​ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరో వార్త తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారం సాగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం రూ.100 కోట్లతో భారీ సెట్ వేయనున్నట్లు కథనాలు కనిపిస్తున్నాయి. అలానే చిత్రాన్ని 2027లో గ్రాండ్​గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కాగా, ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్​తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది.

SSMB 29 Title : ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకధీరుడు ఆవిష్కరించబోతున్నారని మూవీ టీమ్​ చెబుతోంది. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ సినిమాను అనువదించనున్నారు. పలువురు విదేశీ నటులు కనిపించనున్నారని అంటున్నారు. చిత్రానికి మహారాజ్‌ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఆ మధ్య బాగా వినిపించింది. వెండితెరపై మహేశ్​ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారట. ఆ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారని, విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా సెట్స్​పైకి ఎప్పుడు వెళ్తుందో.

పోలీస్ ఆఫీసర్​గా కాజల్ - 'సత్యభామ' ఆ కేసు చేధించిందా? - Kajal Aggarwal Satyabhama Movie

రిలాక్స్ మోడ్​లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్​! - Stress Buster Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.