ETV Bharat / entertainment

మహేశ్‌ - రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీమ్‌ ఫుల్ లిస్ట్​ - ఆ ఒక్కరు తప్ప అంతా ఛేంజ్​! - Rajamouli Mahesh Movie

Rajamouli Mahesh Movie : దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్​తో తెరకెక్కనున్న రాజమౌళి -మహేశ్ సినిమా టెక్నిషియన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 2:29 PM IST

Rajamouli Mahesh Movie : సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్​ ఫారెస్ట్ అండ్​ యాక్షన్‌ అడ్వెంచర్‌ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన టెక్నిషియన్స్ వివరాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్‌.వినోద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు బాధ్యతలు సీక్వరించనున్నట్లు తెలిసింది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాజమౌళి భార్య రమా రాజమౌళి వ్యవహరించనున్నారు.

ఇప్పటికే జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ, స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్​ చేసి తన కొడుకుకు అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక విభాగాలకు సంబంధించిన టెక్నిషియన్స్​ సెలక్షన్స్​ ప్రాసెస్​ను చేస్తున్నారు. అయితే ఈ వివరాల గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రావాల్సి ఉంది. రాజమౌళి దిన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇకపోతే మహేశ్‌ బాబు కూడా ఈ భారీ అడ్వెంచర్​ మూవీ కోసం తన లుక్‌ను మార్చుకుంటున్నారు. జట్టు, గడ్డం కూడా బానే పెంచారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్​గా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్​ దాదాపు ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ఇప్పడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

దాదాపు రూ.1000 కోట్ల(Rajamouli Mahesh Movie Budget) భారీ బడ్జెట్​తో అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా తీయబోతున్నారు. ఇండియన్‌ సినిమా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న ఆవిష్కరించబోతున్నారట. ఇంకా ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారని తెలిసింది. ఇండియన్​ లాంగ్వేజెస్​తో పాటు విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం ఒకే సినిమాగా వస్తుందా? లేక రెండు భాగాలుగా వస్తుందా? అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లొకేషన్లను మూవీటీమ్​ పరిశీలించింది. అక్కడ చిత్రీకరించేందుకు తగిన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది.

నాకు అలాంటోడే కావాలి అంటున్న శ్రీలీల - మీలో ఎవరైనా అలా ఉన్నారా?

సినిమాల్లోకి రాకముందు మీనాక్షి చౌదరి అలాంటి పనులు చేసిందా!?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.