ETV Bharat / entertainment

బ్యూటీఫుల్ బేగం - ఇప్పుడీ ముద్దుగుమ్మపైనే కుర్రాళ్ల ఫోకస్ అంతా! - Rajakar movie Anusriya Tripathi

Rajakar movie Anusriya Tripathi : రీసెంట్​ రిలీజ్​ రజాకార్ సినిమాలో నిజాం భార్య పాత్రలో నటించిన అనుశ్రియ ప్రస్తుతం నెట్టింట్లో మస్త్​ ట్రెండ్ అవుతోంది. ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తనెవరో తెలుసుకుందాం.

బ్యూటీఫుల్ బేగం - ఇప్పుడీ ముద్దుగుమ్మపైనే కుర్రాళ్ల ఫోకస్ అంతా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 2:01 PM IST

Rajakar movie Anusriya Tripathi : తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై సాగించిన పోరాటమే ఈ సినిమా కథ. బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనసూయ వంటి నటీ నటులు నటించిన ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అయి మంచి టాకే తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న రజాకార్ సినిమాలో నిజాం భార్య పాత్రలో ఆజ్మా ఉన్నిసా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి అనుశ్రియ త్రిపాఠి. ఈ పాత్ర తనకు ఎంతగా గుర్తింపు తెచ్చిందంటే సినిమా చూసిన వాళ్లు ఎక్కువగా ఈ భామ గురించి నెట్​లో తెగ వెతికేస్తున్నారు.

అనుశ్రియ త్రిపాఠి స్వస్థలం ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య, 1999లో అక్కడే జన్మించింది. బెంగళూరులో డిగ్రీ చదువుతున్నప్పుడే నటన మీద ఆసక్తి కలిగింది కానీ తండ్రి సివిల్స్​కు ప్రిపేర్ అవ్వమని చెప్పడంతో ఒక మూడేళ్లు చదువుని కొనసాగించింది. 2018లో ఛత్తీస్ ఘడ్ తరపున మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది.

తల్లి కూడా మోడలింగ్ రంగంలో ఉండడం వల్ల కొంత కాలం మోడలింగ్ కెరీర్​ను ఎంచుకుంది. అలా చాలా బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది. ఆ తర్వాత సినీ ఫిల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా అడిషన్స్​లో పాల్గొంది. అప్పుడు ఈ సినిమా డైరెక్టర్ యాటా సత్యనారాయణ నిజాం బేగం పాత్రకు అనుశ్రియ సరిగ్గా సరిపోతుందని సెలెక్ట్ చేశారు.

ఈ సినిమా ద్వారా తన తోటి సీనియర్ నటీనటుల దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది అనుశ్రియ. తనకు అనుష్క, కీర్తి సురేశ్​ ఫేవరెట్ హీరోయిన్స్ అని చెప్పింది. రణ్​బీర్​ కపూర్​, రామ్​చరణ్ ఇష్టమైన హీరోలట. నగలు, చీరలు అంటే తెగ ఇష్టమట. తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దమేనని అంటోందీ భామ. ఇంకా తనకు నచ్చిన నటీనటులతో పనిచేస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

క్రేజీ న్యూస్​ - రామ్​చరణ్ RC 16లో మరో బాలీవుడ్ స్టార్!

ఈ వారమే OTTలోకి 7 ఆస్కార్​లు గెలిచిన 'ఓపెన్ హైమర్' - ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.