Rainy Season Feel Good Movies : చిరు జల్లులు కురుస్తుంటే, వేడి వేడి ఛాయ్ తాగుతూ, అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మనకు అనిపించే ఒకే ఒక్క లోటు టీవీ స్క్రీన్. మరి ఈ వాతావరణానికి తగ్గట్టుగా టీవీలోనూ అదే ఫీల్‌తో ఓ సినిమా చూస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. అందుకే ఈ వర్షాకాలం మన సౌత్ సినిమాలతో మిమ్మల్ని మంచి ఫీల్‌లోకి తీసుకెళ్లేందుకు ఈ లిస్ట్ తీసుకొచ్చాం. రాబోయే సీజన్‌కు రెడీ అవుదామా మరీ.
హ్యాపీ డేస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) : మంచి కాఫీలాంటి సినిమాలు తీసే శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో వచ్చింది 'హ్యాపీ డేస్'. ప్రతి ఒక్కరూ దాటి రావాల్సిన ఇంజినీరింగ్ కాలేజ్ స్టేజ్‌ను చక్కగా చూపించారు. ఇది చూస్తూ ఉంటే 8 మంది స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలతో, ఏదో ఒకటి కనెక్ట్ అయి మీరు మళ్లీ మీ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు.
ప్రేమమ్ (డిస్నీ+ హాట్‌స్టార్) :
టీనేజ్, కాలేజ్, యంగేజ్ ఈ మూడు దశల్లో జార్జ్ అనే వ్యక్తి మనస్సుతో ముడిపడిన కథలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం 'ప్రేమమ్'. సౌత్ సినిమాల్లో కనిపించే ప్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా తీసిన మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. థియేటర్లకు మళ్లీ మళ్లీ ఆడియెన్స్‌ను రప్పించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు.
కాదలిన్ సోదప్పువద్దు ఎప్డీ (డిస్నీ+ హాట్‌స్టార్) :
నేరుగా తమిళంలో తీసిన సినిమా 'కాదలిన్ సోదప్పువద్దు ఎప్డీ'. దీనిని తెలుగులోకి 'లవ్ ఫెయిల్యూర్'గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అరుణ్, పార్వతీ అనే యంగ్ కపుల్ పాత్రలను సిద్దార్థ్, అమలా పాల్ పోషించారు. పార్వతీ ఇంటి సమస్యల కారణంగా సతమతమవుతూనే తన బాయ్‌ఫ్రెండ్ అయిన సిద్దార్థతో ఎలా ప్రవర్తించారనేది కథాంశం.
అయాలుమ్ నానుమ్ తమ్మిల్ (Sun NXT) :
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ భాషా చిత్రం 'అయాలుమ్ నానుమ్ తమ్మిల్'. చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా తెరకెక్కిన సాలిడ్ సినిమా ఇది. మనసుకు హత్తుకునే జ్ఞాపకాలతో సాగిపోతంది ఈ చిత్రం.
కాదలుం కాదందు పోగమ్ (జియో సినిమా) :
నలన్ కుమారస్వామి డైరెక్షన్లో వచ్చిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రమిది. స్వేచ్ఛతో కూడిన జీవితం కావాలంటూ చెన్నైకి వలసపోయిన ఐటీ ఉద్యోగి జాబ్ పోవడం వల్ల ఇంటికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అలా జరగకూడదని సూపర్ మార్కెట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ గడుపుతుంటాడు. ఆ సమయంలో జరిగిన సన్నివేశాలు ఆమెను ఎలా మార్చాయనేది పూరతి కథాంశం.
సినిమాకు ఇన్సూరెన్స్- 25ఏళ్ల క్రితమే 5 రెట్లు లాభం! - First Indian film to be insured