ETV Bharat / entertainment

ఊరమాస్​గా ప్రియమణి, సన్నీలియోని - చెమటలు పట్టిస్తున్న లేటెస్ట్​ ట్రైలర్! - Quotation Gang Trailer - QUOTATION GANG TRAILER

Quotation Gang Trailer : సన్నీలియోనీ - ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఇందులో ఈ భామలిద్దరు తమ భయంకరమైన లుక్స్ అండ్​ యాక్టింగ్​తో​ ఆడియెన్స్​కు చెమటలు పట్టించారు. మీరు చూశారా?

source ANI
Priyamani sunnyleone (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 10:32 AM IST

Updated : Jun 28, 2024, 10:45 AM IST

Quotation Gang Trailer : ప్రియమణి, సన్నీలియోని గురించి ఆడియెన్స్​కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రియమణి పాన్ ఇండియా లెవల్​లో ముద్రవేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే సన్నీలియోని సౌత్ ఇండస్ట్రీలో హవా కొనసాగించేందుకు ట్రై చేస్తోంది. అయితే ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటించిన సినిమా 'కొటేషన్ గ్యాంగ్'. దండుపాళ్యం తరహాలో ఫుల్​​ క్రైమ్ కాన్సెప్ట్​తో రానుందీ చిత్రం.

కోలీవుడ్​లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్​మెంట్​ అప్పుడే క్యారెక్టర్స్​ను రివీల్ చేసి పోస్టర్స్​ను రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేవు. ఇప్పుడు చాలా కాలం తర్వాత సడెన్​గా ట్రైలర్​ను విడుదల చేశారు. ఇందులో జాకీ ష్రాఫ్​ ప్రియమణి, సన్నీలియోని, సారా అర్జున్ వంటి వారు ఉన్నారు. వీరంతా రా అండ్ రస్టిక్ లుక్స్​లో కనిపించి తన నట విశ్వరూపాన్ని బయటపెట్టారు.

ఈ చిత్రం మొత్తం గ్యాంగ్​ వార్స్ నేపథ్యంలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. సుఫారీకి హత్యలు చేసే గ్యాంగ్​లో సన్నీలియోని, ప్రియమణి కూడా ఉన్నారు. వీరంతా డబ్బు కోసమే మనుషులను చంపుతుంటారు. ఈ క్రమంలోనే ఓ బడా గ్యాంగ్​ స్టర్​ను హత్య చేయడంతో వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనేదే కథ.

హత్యలు చేసే వ్యక్తుల్లా ప్రియమణి, సన్నీ లియోనీ తమ భయంకరమైన యాక్టింగ్ అదరగొట్టేశారు. ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్​పై గ్లామరస్ కనిపించిన ఈ బ్యూటీస్ ఇప్పుడు వణుకు పుట్టించారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే నెలలో అన్నీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వివేక్ కుమార్ కన్నన్​ దర్శకత్వం వహించారు. వివేశ్ కుమార్ కన్నన్​తో కలిసి గాయత్రి సురేశ్ నిర్మించారు. డ్రమ్స్ శివమణి సంగీతం అందించారు. వెంకటరమణన్​ ఎడిటర్​గా వ్యవహరించారు.

SunnyLeone Priyamani Upcoming Movies : ప్రియమణి ఈ మధ్య వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఆ మధ్య కస్టడీ, జవాన్, నేరు, భామకలాపం 2, మైదాన్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇక సన్నీలియోని రంగీల, వీరమదేవి, షీరో, కోకా కోలా, హెలెన్, ది బ్యాటిల్ ఆఫ్ భీమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఎన్ని కోట్లంటే?

'కల్కి'లో కృష్ణుడిగా నటించింది ఈ హీరోనే - మీరు గుర్తుపట్టారా? - Kalki 2898 AD Movie Krishna Role

Last Updated : Jun 28, 2024, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.