ETV Bharat / entertainment

'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్​ సెన్సేషనల్ అనౌన్స్​మెంట్ - PUSHPA 3 MOVIE

పుష్ప 3పై ప్రచారం- క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్

Pushpa 3 Update
Pushpa 3 Update (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 3:52 PM IST

Pushpa 3 Update : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్​ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 2021లో బ్లాస్​బస్టర్ విజయం అందుకున్న పుష్ప ది రైజ్‌ సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. అయితే కొంత కాలంగా ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా రానుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై సినిమా నిర్మాతలు తాజా ప్రెస్​మీట్​లో క్లారిటీ ఇచ్చారు.

'పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయ్యింది. దాని వల్లే రెండో పార్ట్ వస్తోంది. అలాగే పుష్ప 2 కొనసాగింపుగా మూడో పార్ట్​ ఇంకేమైనా ఉంటుందా?' అనే మీడియా ప్రశ్నకు ప్రొడ్యూసర్ రవిశంకర్ స్పందించారు. 'కచ్చితంగా మూడో పార్ట్ ఉంటుంది. దానికి కావాల్సిన లీడ్ ఈ క్లైమాక్స్​లో ఉంటుంది' అని రవిశంకర్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో పుష్ప ట్రెండింగ్​లో వచ్చేసింది. ఫ్యాన్స్​ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

కాగా, ప్రెస్​మీట్​లో నిర్మాతలు రవిశంకర్, నవీన్ యర్నేని సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

స్పెషల్​ సాంగ్​లో ఎవరు నటిస్తున్నారు?
ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తుది దశ షూటింగ్​లో ఆ పాటే మిగిలి ఉంది. నవంబరు 4 నుంచి షూట్‌ ప్రారంభం చేయాలనుకుంటున్నాం. మరో రెండు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తాం.

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లు అంటున్నారు. నిజమేంత?
థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నారు. అయితే, నాన్‌ థియేట్రికల్‌ విషయంలో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసింది.

టికెట్‌ ధరల పెంపు గురించి చెబుతారా?
'కల్కి' విడుదల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిశాం. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది. అప్పటి నుంచి పెద్ద సినిమాలన్నింటికీ అదే కొనసాగుతోంది. ఆ విషయంలో మాకు సంతోషం.

2021 లో బ్లాస్​బస్టర్ విజయం అందుకున్న పుష్ప ది రైజ్‌ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్​గా నటించింది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై ఈ సినిమా రూపొందింది. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

'పుష్ప 2'లో యానిమల్ యాక్టర్​ - సుకుమార్ ప్లానింగ్​కు ఫ్యాన్స్ సర్​ప్రైజ్​

'70 ఏళ్లలో ఎప్పుడూ అలా జరగలేదు' - పుష్ప 2 అప్డేట్​ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.