ETV Bharat / entertainment

OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్​ బస్టర్​ సినిమా - డోంట్ మిస్​! - Avesham Movie - AVESHAM MOVIE

Fahadh Faasil Avesham Movie OTT Streaming : పుష్ప విలన్​ ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రూ.100 కోట్ల కలెక్షన్​ మూవీ ఓటీటీ రిలీజ్​కు రెడీ అయిపోయింది. తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 2:59 PM IST

Fahadh Faasil Avesham Movie OTT Streaming : మలయాళం ఇండస్ట్రీకి 2024 బాగా కలిసొస్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ నుంచి విడుదలైన భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్, ప్రేమలు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవగా రీసెంట్​గా రిలీజైన ఫహాద్ ఫాజిల్ ఆవేశం కూడా మంచి సక్సెస్ సాధించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్​ను టచ్ చేసింది. అంటే ఇప్పటికే నాలుగింతల లాభాలను తెచ్చిపెట్టేసింది. ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతూనే ఉంది.

దీంతో సినీ ప్రియులంతా మరోసారి తక్కువ బడ్జెట్​తో తెరకెక్కించి జేబులు ఎలా నింపుకోవాలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ కామెడీ యాక్షన్ డ్రామాను జీతూ మాధవన్ తెరకెక్కించారు. ఇందులో ఫహాద్ నటనకు సినీ ప్రియులు, అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. అలానే ఓటీటీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్​పై సమాచారం అందింది. మే 17 నుంచి అమెజాన్​ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆవేశం కథ విషయానికి వస్తే గ్యాంగ్‌స్ట‌ర్ స్టోరీకి మ‌ద‌ర్‌ సెంటిమెంట్‌, కామెడీని జోడించి తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్​స్టర్​గా కనిపించారు. బీబీ (మిథున్ జై శంక‌ర్‌), శాంత‌న్ (రోష‌న్ శాన్‌వాజ్‌), అజు(హిప్‌స్ట‌ర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లు ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారు. అక్కడ ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో సీనియ‌ర్లు బాగా వేధిస్తారు. మరి లోకల్ గ్యాంగ్​స్టర్​ అయిన ఫహాద్ ఫాజిల్ సాయంతో ఆ ముగ్గురు తమను ర్యాగింగ్ చేసిన వాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? వారి చదువులు ఏమయ్యాయి అనేదే ఈ మూవీ కథ.

కాగా, ఫహాద్ ఫాజిల్ మలయాళంతో పాటు తెలుగు వారికి కూడా సుపరిచితుడే. పుష్ప సినిమాలో నెగటివ్​ పోలీస్​ ఆఫీసర్​గా ఆకట్టుకున్నారు. త్వరలోనే పుష్ప 2లోనూ కనిపించనున్నారు. అంతకుముందు నాయకుడు, విక్రమ్ వంటి చిత్రాలతోనూ మెప్పించారు.

'మలయాళ సినిమాలు బ్లాక్​ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil

OTTలోకి మరో మలయాళీ బ్లాక్ బస్టర్​ క్రైమ్​ థ్రిల్లర్​ - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Nayattu OTT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.