Pushpa 2 Screening Strange Incident : పాన్ఇండియా మూవీ 'పుష్ప 2' వరల్డ్‌వైడ్ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రమంలో కేరళలో ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ మేనేజ్మెంట్ డైరెక్ట్‌గా సెకండాఫ్ ప్రదర్శించింది. ఇంటర్వెల్ సమయంలో 'ఎండ్ కార్డ్' పడేసరికి ఒక్కసారిగా ఆడియెన్స్ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే?
ఇదీ జరిగింది!
డిసెంబర్ 6న కొచ్చిన్ సెంటర్ స్క్వేర్ మాల్లోని సినీపోలిస్ (Cinepolis Centre Square Mall)లో జరిగిన ఈ విచిత్ర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల షో కోసం భారీగా ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చారు. అయితే థియేటర్ యాజమాన్యం పొరపాటున తొలి భాగం ప్రదర్శించకుండానే సెకండాఫ్ ప్లే చేసింది. ప్రేక్షకులు కూడా ఈ పొరపాటను గమనించకుండా సినిమా చూశారు. హాలులో ఒకరిద్దరికి సందేహం వచ్చినా, మోడన్ సినిమాలు ఈ తరహాలోనే ఉంటాయని భావించారంట. తీరా చూస్తే, ఇంటర్వెల్ టైమ్‌లో 'ఎండ్ కార్డ్' పడేసరికి ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్లు చూసింది సెకండాఫ్ అని, ఫస్టాఫ్ మిస్ అయ్యినట్లు ప్రేక్షకులకు అప్పుడు అర్థమయ్యింది.
దీంతో ప్రేక్షకులంతా థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. తమ టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేయగా, ఫస్టాఫ్ చూపించాల్సిందేనని మరికొందరు కోరారు. అయితే ప్రేక్షకులకు కలిగిన అంతరాయం పట్ల స్పందించిన యాజమాజ్యం టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వడానికి అంగీకరించింది. ఇక సినిమా చూడాలని పట్టుపట్టిన కొంతమందికి రాత్రి 9 గంటలకు తొలి భాగం స్క్రీనింగ్ చేశారు.
అక్కడ అలా
ముంబయిలోని ఓ థియేటర్లో పుష్ప స్క్రీనింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాలులో ఘాటైన స్ప్రే చేశాడు. బ్రేక్ సమయంలో ప్రేక్షకులు బయటకు వెళ్లినప్పుడు అతడు ఈ పని చేశాడు. ఇంటర్వెల్ తర్వాత హాలులోకి వచ్చిన ప్రేక్షకులకు ఆ స్ప్రే వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.
మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్- 'పుష్ప 2' టికెట్ ధరలు తగ్గింపు!
'పుష్ప రాజ్' బాక్సాఫీస్ ఊచకోత- మూడు రోజుల్లోనే రూ.600 కోట్లు క్రాస్