సోషల్ మీడియాలో చాలా సార్లు సెలబ్రిటీల పర్సనల్ ఓల్డ్ రేర్ పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయన్న సంగతి తెలిసింది. ముఖ్యంగా వారి చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిని సినీ ప్రేక్షకులు, నెటిజన్లు కూడా ఆసక్తిగా తిలకిస్తూ తెగ షేర్ చేస్తుంటారు. అలా తాజాగా మరో ఫొటో బయటకు వచ్చి తెగ చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ ఈ పిక్ మరెవరిదో కాదు. స్టార్ యాంకర్ అనసూయ. ఎప్పుడూ కాంట్రవర్సీలతో ఎక్కువగా హాట్‌టాపిక్‌గా నిలిచే ఈమె ప్రస్తుతం టాలీవుడ్లో విలక్షణ నటిగా రాణిస్తోంది. మొదట బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది అనసూయ. తన అందం, హోస్టింగ్ స్టైల్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను కూడా దక్కించుకుంది. అలా ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే సినీ అవకాశల కోసం ట్రై చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం పుష్పలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటించి మరింత స్టేటస్‌ను దక్కించుకుంది. ఇంకా పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. యాత్ర, కథనం, మీకు మాత్రమే చెప్తా, చావు కబురు చల్లగా, ఖిలాడీ, దర్జా మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెద్ద కాపు, ప్రేమ విమానం, రజాకార్ వంటి సినిమాల్లో నటించింది. ఇతర భాషల్లోనూ కనువిందు చేసింది. మలయాళంలో మమ్ముట్టితో కలిసి భీష్మ పర్వంలోనూ నటించింది. ఇంకా సోగ్గాడే చిన్ని నాయనా, విజేత, ఎఫ్ 2, చావు కబురు చల్లగా వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేసింది.
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. తనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా తన చిన్ననాటి ఫొటోను(Anasuya Childhood Photo) ఇప్పటి ఫొటోను జత చేసి ఓ వీడియోగా పోస్ట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాప్ సాంగ్ కూడా యాడ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు భలే క్యూట్‌గా ఉందిగా అంటూ కామెంట్లు చేస్తూ దాన్ని షేర్ చేస్తున్నారు.
'జై హనుమాన్'కు రాముడి ఆశీర్వాదం- ధర్మంతో వీరమల్లు యుద్ధం! - Harihara Veera Mallu Teaser