ETV Bharat / entertainment

రాజమౌళి కూడా టచ్‌ చేయని జానర్​లో త్రివిక్రమ్‌-బన్నీ సినిమా! - ALLU ARJUN TRIVIKRAM MOVIE

అల్లు అర్జున్​ - త్రివిక్రమ్​ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత నాగవంశీ!

Trivikram  Allu arjun Movie
Trivikram Allu arjun Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 8:17 AM IST

Allu arjun Trivikram Movie : టాలీవుజ్ ఇండస్ట్రీలో సెల్ఫ్​ మేడ్​ పాన్ ఇండియా స్టార్ అనగానే టక్కువ గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్​. ఎందుకంటే తెలుగు చిత్ర సీమలో రాజమౌళితో చేసిన వారే పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు! కానీ జక్కన్నతో సినిమా చేయకుండానే దేశవ్యాప్తంగా ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సృష్టించుకున్న హీరో అంటే అది బన్నీ మాత్రమే. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు.

ఇంకా చెప్పాలంటే తన స్టైల్‌ అండ్ ఆటిట్యూడ్​తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. మరి కొన్ని రోజుల్లో పుష్ప 2తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఈ చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఆ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ పెరిగింది.

"అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశకు వచ్చాయి. పుష్ప 2 అయిపోగానే ఈ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తాం. జనవరిలో స్పెషల్‌ ప్రోమోతో సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేస్తాం. మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. మార్చిలోనే అల్లు అర్జున్‌ షూటింగ్​లో పాల్గొంటారు. ఇప్పటి వరకు జక్కన్న ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆయన కూడా టచ్‌ చేయని జానర్‌లో త్రివిక్రమ్​ బన్నీ సినిమా ఉంటుంది. మంచి భారీ విజువల్స్‌ ఉంటాయి. ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.

అలానే రీసెంట్​గా తాను మాట్లాడిన టికెట్ల ధరల కామెంట్స్​పై నాగవంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు పెద్ద సినిమాలకే టికెట్ల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మిగతా వాటికి రేట్లు పెంచడం లేదని అన్నారు. పెద్ద చిత్రాలకు బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. అందుకే వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుతామని చెప్పారు. జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం వారి ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు.

'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్​ సెన్సేషనల్ అనౌన్స్​మెంట్

బన్నీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఒక్కరోజు ముందుగానే 'పుష్ప 2' రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.