ETV Bharat / entertainment

తప్పులు పట్టుకుంటే పార్టీ ఇస్తా!: 'లక్కీ భాస్కర్​'పై నాగవంశీ కామెంట్స్​ - LUCKY BASKHAR TRAILER

లక్కీ భాస్కర్ సినిమాపై నాగవంశీ కామెంట్స్ వైరల్- మూవీలో తప్పులు పట్టుకుంటే పార్టీ ఇస్తానన్న నిర్మాత

Lucky Baskhar Trailer
Lucky Baskhar Trailer (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 8:09 PM IST

Lucky Baskhar Trailer : స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'లక్కీ భాస్కర్'. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమా తెరకెక్కించారు. సృష్టిలో ధనం అన్నింటికంటే విలువైందనే కాన్సెప్ట్​తో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమా వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు.

తప్పులు పట్టుకుంటే పార్టీ!
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లోనే నిర్వహించారు. ఈ ఈవెంట్​కు హాజరైన నిర్మాత నాగవంశీ (Naga Vamshi) సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తప్పులు దొరకవని, ఒకవేళ తప్పులు పట్టుకుంటే పార్టీ ఇస్తానని అన్నారు. 'నాకు తెలిసి ఈ సినిమాలో తప్పులు దొరకవు అని నమ్మకం ఉంది. ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్లందరినీ పిలిచి పార్టీ ఇచ్చి, వాళ్లతో ఫొటో దిగుతా' అని నిర్మాత నాగవంశీ అన్నారు.

మలయాళంలోనూ చేయలేదు
లక్కీ భాస్కర్ లాంటి సినిమా మలయాళంలోనూ చేయలేదని హీరో దుల్కర్‌ సల్మాన్ అన్నారు. 'ఇలాంటి జానర్‌ సినిమా నేను మలయాళంలోనూ చేయలేదు. స్క్రిప్టు వినగానే నచ్చింది' అని అన్నారు. 'కల్కి 2' (Kalki AD 2898) లో కనిపిస్తారా? అని మీడియా నుంచి దుల్కర్​కు ప్రశ్న ఎదురైంది. 'కల్కి పార్ట్‌ 1లో ఉంటాననే సంగతే నాకు తెలియదు. సడెన్‌గా షూటింగ్‌లో పాల్గొన్నా' అని చెప్పారు.

'వెంకీ అట్లూరీ ఈ కథ చెప్పే సమయంలోనే సుమతి (హీరోయిన్‌ పాత్ర) రోల్​కు కనెక్ట్‌ అయిపోయా. దుల్కర్‌తో కలిసి నటించాలనే కల ఈ చిత్రంతో నెరవేరింది' అని మీనాక్షి పేర్కొంది. కాగా, ఈ సినిమాలో దుల్కర్​కు సరసన మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.