Priyamani on Star Heroes : ప్రముఖ నటి ప్రియమణి తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. విలన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈమె చెన్నై ఎక్స్ ప్రెస్, ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య సూపర్ హిట్ అయిన జవాన్, మలయాళ సినిమా నెరు, ఆర్టికల్ 370 లాంటి వాటిల్లో ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ప్రస్తుతం 1952 నుంచి 1962 మధ్యలో ఫూట్ బాల్ కోచ్‌గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమాలో అజయ్ దేవగణ్‌తో కలిసి ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియమణిని ఒక ఇంటర్వ్యూలో తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోలతో మీరు నటించకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది.
అందుకు ప్రియమణి సమాధానం చెబుతూ - "ఆ ప్రశ్న నన్ను కాదు డైరెక్టర్స్‌ను, నిర్మాతలను అడగాలి. నాకు కూడా అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర పూర్తి సమాధానం లేదు. అయితే కొంతమంది నేను స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే వాళ్లను నేనే డామినేట్ చేస్తానని, హైలైట్ అవుతానని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని నాకు తెలుసు. నేను ఈ విషయం మీద ఎవరిని తప్పు పట్టాలని అనుకోవడం లేదు. నేను చేసిన సినిమాలు, పాత్రలతో నాకు పూర్తిగా సంతృప్తి దొరికింది. కొన్నిసార్లు ఇంట్లోనే ఉండి వచ్చిన ప్రాజెక్ట్స్ ఓకే చెప్పాను. అయితే అదృష్టవశాత్తూ అవి మంచి పేరే తెచ్చాయి. అలా అని నాకు ఎవరితో ఎలాంటి సమస్యలు లేవు. ఎప్పుడు కలిసినా అందరూ చక్కగా పలకరిస్తారు. మాట్లాడుకుంటాం కానీ వాళ్లతో నటించే అవకాశం రాలేదు అంతే. కాకపోతే కొన్ని సార్లు ఫీల్ అవుతుంటాను." అని అన్నారు. ప్రియమణి నటిస్తున్న మైదాన్ రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్‌కు స్టార్ నటి సలహా! - Zeenat Aman
అందుకే సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా - అసలు విషయం చెప్పిన తాప్సీ - Tapsee Pannu Marriage