ETV Bharat / entertainment

OTTలోకి ప్రేమలు భామ మమితా బైజు కొత్త సినిమా - రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా! - Premalu Heroine Mamitha Baiju - PREMALU HEROINE MAMITHA BAIJU

Premalu Heroine Mamitha Baiju Pranaya vilasam : ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ వేదికగా రిలీజ్​కు రెడీ అయింది. పూర్తి వివరాాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 4:25 PM IST

Premalu Heroine Mamitha Baiju Pranaya vilasam : ఈ ఏడాది సూపర్ హిట్స్​లో ఒకటిగా నిలిచింది మలయాళ సినిమా ప్రేమలు. అలానే ఈ మూవీలో హీరోయిన్​గా చేసిన మమిత బైజు ప్రస్తుతం యూత్ క్రష్ లిస్ట్​లోకి చేరిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమెనే కనపడుతోంది. అందరూ ఈమె అందానికి ఫిదా అయిపోతున్నారు. దీంతో చాలా మంది కుర్రాళ్లు, ఆడియెన్స్​ ఈమె నటించిన గత సినిమాల గురించి కూడా తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఆమె నటించిన పాత చిత్రాల జాబితా వివరాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే మమిత 2023లో ప్రధాన పాత్రలో నటించిన ప్రణయ విలాసం సినిమాను ఆడియెన్స్​ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఈటీవీ విన్. ఈ చిత్రం మలయాళంలో మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీనే ఇక్కడి ఆడియెన్స్ తెలుగు డబ్బింగ్​తతో ఈటీవీ విన్​లో విడుదల చేయనున్నారు. "మొదటి ప్రేమ అందరి జీవితాలలోని సజీవమే అదెప్పుడు రొమాంటిక్​గా ఉంటుంది" అంటూ ఈటీవీ విన్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీ మే 2 అని ప్రకటించింది.

ఈ చిత్రంలో అర్జున్ అశోకన్ సరసన మమిత బైజు నటించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ చాలా విలువైనది, ప్రత్యేకమైనది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. వయసులో ఉన్నవారికే కాదు మధ్య వయసు వారిలో కూడా తొలి ప్రేమ తాలూకు అందమైన అనుభవాలు జీవితాంతం గుర్తుంటాయి అని ఇందులో సందేశం ఉంటుంది.

రీసెంట్​గా నెరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వరా రాజన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈటీవీలో మా అత్త బంగారం అనే సీరియల్​లో ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీధన్య కూడా ఈ చిత్రంలో హీరో అర్జున్​కు తల్లిగా నటించింది. రాజీవన్ ఇందులో అర్జున్​కు తండ్రిగా నటించారు. మలయాళంలో యూత్​ను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి దర్శకుడు నిఖిల్ మురళి. సిబి చవరా, రేంజిత్ నాయర్ ఈ మూవీని నిర్మించారు.

ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే! - This week Movie Releases

పవర్​ స్టార్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​​ - ఎన్నికల ముందే ఆ సినిమా రిలీజ్​! - Pawankalyan Rerelease Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.