ETV Bharat / entertainment

'కళ్లు తెరచి ఓటేయండి- లేకపోతే చచ్చిపోండి'- నారా రోహిత్ పవర్​ఫుల్ పొలిటికల్ పంచ్! - Prathinidhi 2 Teaser - PRATHINIDHI 2 TEASER

Prathinidhi 2 Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ప్రతినిధి-2 టీజర్ శుక్రవారం రిలీజైంది. మీరు టీజర్ చూశారా?

prathinidhi 2 teaser
prathinidhi 2 teaser
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 11:54 AM IST

Updated : Mar 29, 2024, 2:02 PM IST

Prathinidhi 2 Teaser: పదేళ్ల క్రితం వచ్చిన 'ప్రతినిధి' సినిమా సమాజంలో ఎన్నో సమస్యలపై ప్రశ్నలను లేవనెత్తింది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జర్నలిస్ట్​గా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కింది 'ప్రతినిధి-2'. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్​లో పదునైన డైలాగ్స్​తో నారా రోహిత్ విశ్వ రూపం చూపించారు. ఎన్నికల వేళ ఈ టీజర్​లో డైలాగులు రాజకీయాలకు సంబంధించినదిగా ఉండడం అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

ఒకటిన్నర నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ టీజర్​ ఓ బంగ్లాలో బంబ్​ పేళుడుతో ప్రారంభమౌతుంది. ఇక ఈ టీజర్​లో నారా రోహిత్ డైలాగ్సే హైలైట్. 'రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది?' ఇక చాలా కాలం పాటు బుల్లి, వెండి తెరకు దూరంగా ఉన్న ఉదయభాను కూడా ఈ సినిమా టీజర్ లో కనిపించింది. ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ ఈ సినిమాలో కనిపించనున్నారు. 'ఒళ్లు వంచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే దేశం విడిచి వెళ్లిపోండి. అదీ కూదరకపోతే చచ్చిపోండి' అంటూ ఈ దేశ పౌరులుగా మన బాధ్యతను గుర్తు చేయడం టీజర్​లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన డైలాగ్.

ఇక ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాను పూర్తి పొలిటిలక్ థ్రిల్లర్​గా తెరకెక్కించారు. వానరా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్​కు మంచి స్పందన రాగా, తాజా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో రోహిత్​కు జోడీగా నటి సిరి నటించింది. ప్రధాన పాత్రలలో జిషుషేన్ గుస్తా, శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌, దినేష్ తేజ్వంటి వంటి నటులు కూడా కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంట్రెస్టింట్​గా నారా రోహిత్​ 'ప్రతినిధి 2' కాన్సెప్ట్​ టీజర్​

Nara Rohit Prathinidi 2 : నారా రోహిత్ సినిమా ఫస్ట్​లుక్ ఔట్.. సినిమా వచ్చేది అప్పుడే!

Last Updated : Mar 29, 2024, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.