ETV Bharat / entertainment

'సింబా'పై ప్రశాంత్ వర్మ మరో సూపర్ అప్డేట్‌ - నందమూరి ఫ్యాన్స్‌లో పెరిగిన జోష్‌ - Prasanth Varma Mokshagna - PRASANTH VARMA MOKSHAGNA

Prasanth Varma Mokshagna : తన తర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు ప్రశాంత్‌ వర్మ. దీంతో నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

source ETV Bharat
Prasanth Varma Mokshagna (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 3:12 PM IST

Prasanth Varma Mokshagna : సంక్రాంతికి 'హనుమాన్‌' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్‌ అందుకున్న టాలెంటెడ్‌ దర్శకుడు ప్రశాంత్ వర్మ - రెండు రోజుల క్రితం ఒక సింహం తన పిల్లను చూపుతోన్న ఫొటోను పోస్ట్ చేసి సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించారు. 'సింబా ఈజ్‌ కమింగ్‌' అంటూ మూవీ లవర్స్‌లో ఉత్కంఠత రేపారు.

Prasanth Varma Simba Movie : అయితే గత కొద్ది రోజులుగా ప్రశాంత్ వర్మ నందమూరి నట వారసుడు మోక్షజ్ఞను తన సినిమాతో లాంఛ్‌ చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా మోక్షజ్ఞతోనేనని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. అలానే మోక్షజ్ఞను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో అని తెగ చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ వర్మ మరో పోస్ట్‌తో నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రెట్టింపు చేశారు. "వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం" అంటూ తాజా పోస్ట్‌లో రాసుకొచ్చారు. రేపు(సెప్టెంబర్ 6) ఉదయం 10.36కు ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తానని పేర్కొన్నారు. దీంతో నందమూరి అభిమానులంతా రేపు మోక్షజ్ఞను చూడనున్నామంటూ కామెంట్స్‌ చేస్తూ తెగ సంతోషపడిపోతున్నారు.

కాగా, ప్రశాంత్‌ వర్మ ఈ సింబా చిత్రాన్ని తన సినిమాటిక్‌ యూనివర్స్‌(PVCU)లో భాగంగా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. చూడాలి మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపే వార్తను చెబుతారో లేదో. ఏదేమైనా ఈ విషయంపై ఓ స్పష్టత రావాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Prasanth Varma Hanuman Sequel : అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. మొదటి దశలో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. హనుమాన్ సీక్వెల్‌ 'జై హనుమాన్‌' కన్నా ముందు అధీర, మహాకాళి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడు హీరో అని చెప్పారు.

'సింబా ఈజ్ కమింగ్' - మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్! - Prasanth Varma Mokshagna Movie

తల్లి పాత్రలో నివేదా థామస్ - '35 చిన్న కథ కాదు' ఎలా ఉందంటే? - 35 Chinna Katha Kadu Telugu Review

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.