ETV Bharat / entertainment

'హనుమాన్​లో విభీషణుడి పాత్ర కీలకం - ఆయనే నా ఫస్ట్​ ​ఛాయిస్​' - ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ

Prasanth Varma Hanuman Movie : చిన్న బడ్జెట్​తో సినిమా తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్​లో దూసుకెళ్తున్నారు డైరెక్టర్​ ప్రశాంత్ వర్మ. 'హనుమాన్' సినిమాతో మంచి క్రేజ్​ సంపాందించుకున్న ఈ యంగ్​ డైరెక్టర్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ​

Prasanth Varma Hanuman Movie
Prasanth Varma Hanuman Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 12:54 PM IST

Updated : Jan 24, 2024, 2:43 PM IST

Prasanth Varma Hanuman Movie : తేజా సజ్జా లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హను-మాన్‌'. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్​తో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఫుల్​ స్వింగ్​లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. అయితే ఇందులో కీలక పాత్రైన విభీషణుడి రోల్​ కోసం సముద్రఖనికి బదులుగా తొలుత ఓ స్టార్​ హీరోను అనుకున్నారట. ఇంతకీ ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు రిషబ్​ శెట్టి. ఈ విషయాన్ని తాజాగా ప్రశాంత్​ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఈ సినిమాలో సముద్రఖని పోషించిన విభీషణుడి రోల్​ ఎంతో కీలకం. దీని కోసం మొదట కన్నడ నటుడు రిషబ్‌ శెట్టిని ఎంచుకోవాలని నేను అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆయన 'కాంతార'తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన భవిష్యత్తులో తప్పకుండా నా సినిమాటిక్‌ యూనివర్స్‌లో నటిస్తానని చెప్పారు. బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్​ నితీశ్‌ తివారీ రామాయణాన్ని తెరకెక్కించకపోతే నేను దాన్ని చేస్తాను" అని ప్రశాంత్​ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు తన చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచాలనుకుంటున్నట్లు ప్రశాంత్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడి చిత్రాల రిలీజ్‌ల గురించి హాలీవుడ్‌ మాట్లాడుకునే స్థాయికి తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Jai Hanuman Movie : ఇక సినిమా విషయానికి వస్తే - ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్​ రానుంది. 'జై హనుమాన్‌' అనే టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి.

Hanuman Movie Cast : తొలి పార్టులో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Last Updated : Jan 24, 2024, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.