ETV Bharat / entertainment

సలార్ 2​లో ఆమె 'గేమ్​ఛేంజర్' కాదట - అదంతా ఫేక్​! - Prabhas Salaar 2 - PRABHAS SALAAR 2

Prabhas Salaar 2 Kiara Advani : సలార్​ 2లో శ్రుతిహాసన్​తో పాటు ఆ స్టార్​ హీరోయిన్​ నటించనున్నట్లు గత రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా దీనిపై మరో కొత్త ప్రచారం మొదలైంది. అదంతా కేవలం రూమర్స్ అని తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 3:07 PM IST

Prabhas Salaar 2 Kiara Advani : సలార్‌ 2ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌లో లేదా జులైలో పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. రెండో భాగంలో మరికొన్ని అదనపు ఆకర్షణలు ఉంటాయని, అందులో భాగంగా మరో హీరోయిన్​ను ఎంపిక చేయడంపై మూవీటీమ్​ దృష్టి పెట్టినట్టు గత రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఫస్ట్​ పార్ట్​లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సలార్‌ 2లోనూ ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది. అయితే శ్రుతి హాసన్​తోపాటు హిందీ భామ కియారా అడ్వాణీ కూడా రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నారని విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఓ ప్రత్యేక గీతంలోనూ కియారా ఆడిపాడనుందని ప్రచారం సాగుతోంది. దీంతో చాలా మంది ఎక్సైటింగ్​గా ఫీలయ్యారు.

అయితే తాాజాగా ఈ విషయంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే ఈ న్యూస్ అంతా ఫేక్ అని తెలిసింది. కియారా స్పెషల్ సాంగ్ ఏమీ చేయట్లేదని ఓ సోర్స్ ద్వారా సమాచారం అందింది. ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని వాళ్లు పేర్కొన్నారు. ఎవరు కూడా కియారాను సలార్​ 2 విషయమై సంప్రదించలేదని తెలిపారు. ఆమె తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తుందని, అది రామ్ చరణ్ గేమ్​ ఛేంజర్ అని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైన ఇందులో నిజమెంతో మరింత పక్కాగా తెలియాలంటే మూవీ టీమ్​ స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

ఇకపోతే ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సలార్ తొలి భాగం గ్రాండ్​గా హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.700 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. సలార్​ 2ను కూడా ప్రశాంత్​ నీలే తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

బంపర్ ఆఫర్ : ప్రభాస్ ఐకానిక్ బైక్ మీ సొంతమవ్వాలా? ఇలా చేస్తే చాలు! - salaar Bike

వీకెండ్ స్పెషల్​ - OTTలోకి వచ్చేసిన రూ.200కోట్ల భారీ బ్లాక్ బస్టర్ కాంట్రవర్సీ మూవీ - This week OTT releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.