ETV Bharat / entertainment

ప్రభాస్​ రిజెక్ట్​ చేసిన బ్లాక్​ బస్టర్​ మూవీస్! రెబల్​ స్టార్ ఆ సినిమాలు చేసుంటే కథ వేరేలా ఉండేది! - PRABHAS REJECTED MOVIES

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 1:50 PM IST

Prabhas Rejected Movies : ఎంత పెద్ద హీరో అయినా సరే, కొత్తగా ఓ సినిమా చేయాలంటే కథ విషయంలో అనేక సార్లు ఆలోచిస్తుంటారు. స్క్రిప్ట్​ను ఆచూ తూచీ ఎంచుకుంటుంటారు. విన్న కథలన్నీ నచ్చుతాయనే గ్యారెంటీ లేదు. నచ్చిన కథలన్నింటిలోనూ నటించే వీలు ఉంటుందనీ కూడా చెప్పలే. అలా పలు కారణాలతో పలువురు స్టార్స్ ఎన్నో సినిమాలను వదులుకున్నారు. తాజాగా 'కల్కి 2898 AD' సినమాతో బ్లాక్​బస్టర్​ హిట్ అందుకున్న పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ కూడా అలాంటి పనే చేశారు. మరి ఆయన వదులుకున్న సుపర్​ హిట్​ సినిమాలు ఏవంటే?

Prabhas Rejected Movies
Prabhas Rejected Movies (ETV Bharat)

Prabhas Rejected Movies : తన పర్సనాలిటీ తగ్గట్టుగా అనిపించే పాత్రలను ఎంపిక చేసుకుంటారు పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్. అయితే ఇలా ఆచూ తూచీ కథను ఎంచుకునే క్రమంలో ప్రభాస్​ చాలాబ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నారట. అందులో దాదాపు అన్నీ సూపర్​ హిట్​ చిత్రాలే ఉన్నాయి. అలా ఆ కథలను రిజెక్ట్ చేయకుండా ఉండుంటే ఈ పాన్ ఇండియా స్టార్ ఖాతాలో మరెన్నో హిట్ సినిమాలు ఉండేవట. అవేంటో ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారో ఓ లుక్ వేద్దాం.

దిల్​ :
వివి వినాయక్​ దర్శకత్వంలో 2003లో విడుదలైన దిల్​ సినిమా అప్పట్లో యూత్​ను ఓ ఊపు ఊపేసింది. ఒక్క దెబ్బకు నితిన్​ను స్టార్​ చేసింది. అయితే ఈ యూత్​ ఎంటర్​టైనర్​ కథను వినాయక్​ ముందు ప్రభాస్​కే చెప్పారట.

సింహాద్రి :
దిగ్గజ దర్శకుడు రాజమౌళి- యంగ్​ టైగర్ ఎన్​టీఆర్​ కాంబోలే 2003లో వచ్చిన బ్లాక్​ బస్టర్​ హిట్ సినిమా సింహాద్రి. అయితే ఈ కథని మొదట ప్రభాస్​కు వినిపించాడట రాజమౌళి. కానీ ప్రభాస్ ఆఫర్​ను రిజెక్ట్​ చేశారట. కాగా, ప్రభాస్-రాజమౌళి కాంబోలో 2005లో ఛత్రపతి సినిమా రావడం గమనార్హం.

ఆర్య :
టాలీవుడ్​ అగ్ర దర్శకుడు సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబినేషన్​లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య. ఈ సినిమాతో బన్నీ కెరీర్​ ఓ మలుపు తిరిగింది. ఇటీవల 25ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫర్​ మొదట ప్రభాస్​కు వెళ్లిందట. కానీ ఈ క్యారెక్టర్​ తనకు సెట్​ కాదని తిరస్కరించారట.

నాయక్ :
గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ హీరోగా వివి వినాయక్ డైరెక్ట్​ చేసిన సినిమా నాయక్. ఇందులో కాజల్ అమలాపాల్ నటించారు. మంచి హిట్​ టాక్​ సొంతం చేసుకున్న ఈ మూవీ కథ మొదట ప్రభాస్​కు చెప్పారట వినాయక్.

ఒక్కడు :
దర్శకుడు గుణశేఖర్- సూపర్​ స్టార్ మహేశ్​ బాబు కాంబోలో సూపర్​ హిట్​గా నిలిచిన చిత్రం ఒక్కడు. భూమిక హిరోయిన్​గా నటించిన ఈ సినిమా మహేశ్​కు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆఫర్​ మొదట ప్రభాస్​కే వచ్చిందట. కానీ ఆయన ఈ చిత్రాన్ని వదులుకున్నారట.

బృందావనం :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్​టీఆర్​ నటించిన ఫ్యామిలీ ఎంటర్​టైనర్ బృందావనం. ఈ సినిమాలో ఎన్​టీఆర్ కాజల్ అగర్వాల్, సమంతతో ఆడిపాడారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్​ ఫస్ట్​ ప్రభాస్​కే వినిపించారట వంశీ. కానీ డార్లింగ్​ నో చెప్పారట.

కిక్​ :
మాస్​ మహారాజ రవితేజ- అందాల హీరోయిన్ ఇలియానా నటించిన కిక్​ చిత్రం బ్లాక్​ బస్టర్​ విజయం సాధించింది. రవితేజ కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా కథ ఫస్ట్​ ప్రభాస్​కు చెప్పారట దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా రిజెక్ట్​ చేశారట ప్రభాస్​. అందులో గోపిచంద్ నటించిన జిల్, ఎన్​టీఆర్ నటించిన ఊసరవెల్లి, రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్​శీను కూడా ఉన్నాయట. ఏది ఏమైనా ఈ సినిమాలన్నీ డార్లింగ్​ ప్రభాస్​ చేసుంటే ఆ కిక్​ వేరే లెవెల్​లో ఉండేది కదా!.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.