ETV Bharat / entertainment

'రాజాసాబ్‌'లో ఆ క్యారెక్టర్ ఎంట్రీ అప్పుడే- ఫుల్ క్రేజీగా ఉంటుందట! - PRABHAS RAJASAAB CHARACTER

రాజాసాబ్​లో ప్రభాస్ డ్యుయెల్ రోల్- ఆ పాత్ర ఎంట్రీ అప్పుడే!

Prabhas Rajasaab Character
Prabhas Rajasaab Character (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 8:10 PM IST

Prabhas Rajasaab Character : పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ది రాజాసాబ్‌'కి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ తెలిసింది. అక్టోబర్‌ 23న బుధవారం ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ సింహాసనం మీద ఓ చేతిలో సిగార్‌, నెరిసిన జుట్టుతో ఓ రాజు లాగా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ పాత్రకు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ తరహా పాత్రలో ప్రభాస్‌ తొలిసారి కనిపిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ పాత్ర 'ది రాజాసాబ్‌'లో సెకండాఫ్‌లో వస్తుందని తెలిసింది. ఈ క్యారెక్టెర్‌ వెనుక సాలిడ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని సమాచారం. ఈ పాత్రలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ క్రేజీగా ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు మారుతి కామెడీ, హర్రర్​ జానర్​లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినం చేస్తున్నట్లు టాక్. ప్రభాస్​తోపాటు మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, త్వరలోనే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సలార్‌ 2 సెట్స్‌లోకి డార్లింగ్‌ అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస సినిమాలు, కీలక అప్‌డేట్‌లతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.

టాక్‌ షోలో ప్రభాస్‌
'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమం 23వ ఎపిసోడ్‌కు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారామశాస్త్రి సాహిత్యాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 'ఈటీవీ' సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త ఎపిసోడ్‌ ఓటీటీ 'ఈటీవీ విన్‌' (ETV Win)లో బుధవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వల్లే సినీ సాహిత్యంపై తనకు ప్రేమ పుట్టిందని ప్రభాస్‌ అన్నారు.

'రాజా సాబ్​' బర్త్​డే స్పెషల్ మోషన్ పోస్టర్ - సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ

ప్రభాస్​ ఫ్యాన్స్​కు అదిరే అప్డేట్​ - వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్ - Rajasaab Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.