ETV Bharat / entertainment

భారీగా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ - లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే! - Kalki 2898 AD Pre Release Event - KALKI 2898 AD PRE RELEASE EVENT

Kalki Pre Release Event : కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్​ ముంబయి వేదికగా గ్రాండ్​గా జరగనుంది. విలక్షన హీరో రానా హోస్ట్​గా వ్యవహరిస్తారని ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Kalki Pre Release Event
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 12:16 PM IST

Kalki Pre Release Event : మరో వారం రోజుల్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచాయి. హాలీవుడ్ రేంజ్​లో మూవీ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే కల్కి టీమ్ మెంబర్స్​​ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన స్పెషల్ కార్​ బుజ్జితో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాన్ని తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు మూవీ మెయిన్ టీమ్ రంగంలోకి దిగబోతుంది. మరి కొద్ది గంట్లలో ముంబయి వేదికగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహిస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే కల్కి మెయిన్ టీమ్ అంతా ముంబయి చేరుకున్నారు. విలక్షన హీరో రానా ఈ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఇకపోతే సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. దీంతో ముంబయిలోని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్ కోసం వేదిక దగ్గరకు చేరుకుంటున్నారు. అలానే ఈ ఈవెంట్​కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం అందుతోంది. అయితే ఈ ఈవెంట్​ను వైజయంతి నెట్ వర్క్ యూట్యూబ్ ఛానల్​లో మాత్రమే లైవ్ ఇస్తున్నారు. మరి ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి మీరు చూడాలంటే ఈ కింది వీడియో లింక్​లో చూసేయండి.

Kalki Cast and Crew : కాగా, ఈ చిత్రాన్ని సైన్స్​కు మైథాలజీని జోడించి తెరకెక్కించారు. ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఇది సాగుతుంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్​పై నిర్మాత అశ్వినీ దత్​ నిర్మించారు. మహానటి ఫేమ్ నాగ్​ అశ్విన్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్​ కమల్​ హాసన్​, బోల్డ్ బ్యూటీస్​ దిశా పటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.

'కల్కి' ఫస్ట్ రివ్యూ - టాక్​ ఎలా ఉందంటే? - Kalki 2898AD First Review

మిత్రవింద లగ్జరీ లైఫ్​​ - ఈ ముద్దుగుమ్మ ఆస్తి ఎన్ని కోట్లంటే? - Happy Birthday Kajal Aggarwal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.