Prabhas Kalki 2898 AD OTT Release Date : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఓటీటీ లవర్స్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 22 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్, అమెజాన్‌లో సౌత్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు.
కథేంటంటే : కురుక్షేత్రం ముగిసిన ఆరు వేల ఏళ్లకు ఈ సినిమా కథ మొదలవుతుంది. భూమిపై మొదటి నగరంగా పురాణాలు చెప్పిన కాశీని, చివరి నగరంగా చూపిస్తారు. భూమిపై ఉన్న అన్ని వనరులను తీసేసుకుని, స్వర్గంలా కాంప్లెక్స్ అనే మరో నగరాన్ని నిర్మించి(భూమికి ఆకాశానికి మధ్యలో) సుప్రీం యాస్కిన్(కమల్ హాసన్) పాలిస్తుంటాడు. అయితే కాశీలో బౌంటీ ఫైటర్ భైరవ (ప్రభాస్) బాగా యూనిట్స్‌ను సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే మరోవైపు సుప్రీం యాస్కిన్ చేస్తున్న ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైనికులు కాశీకి వచ్చి గర్భం దాల్చిన అమ్మాయిలను తమ నగరానికి పట్టుకుపోతుంటారు. అలా చాలా మంది అమ్మాయిలను ఈ ప్రాజెక్ట్-కె కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సీరమ్ సేకరించి ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె సీరమ్ ప్రాజెక్ట్ కె ఎక్స్పెరిమెంట్ కోసం సరిపోతుంది. దీంతో సుమతిని బంధించేందుకు ప్రయత్నం చేస్తారు.
ఇంకోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఓ తల్లి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. పోరాటాలు చేస్తూ త్యాగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారు ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. దీంతో సుమతిని వారు కాంప్లెక్స్ నుంచి తప్పిస్తారు.
మరోవైపు 'కల్కి' పుట్టబోయేది ఆ సుమతి కడుపులోనేనని తెలుసుకున్న అశ్వత్థామ(అమితాబ్) ఆమెను కాంప్లెక్స్ నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే భైరవ, అశ్వత్థామ - సుమతి కోసం ఎందుకు గొడవపడ్డారు? వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? అసలు సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ - కె లక్ష్యం ఏమిటి? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే!
The dawn of a new ERA awaits you 🌅
— prime video IN (@PrimeVideoIN) August 17, 2024
And this is your gateway into the GRAND world of Kalki⛩️🔥#Kalki2898ADOnPrime🔥, Aug 22#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/9FYs2quk5C
వీకెండ్ స్పెషల్ - ఈ వారం 23 సినిమా/సిరీస్‌లు - ఆ 4 వెరీ ఇంట్రెస్టింగ్! - This Week OTT Releases