Kalki 2898 AD kamal Haasan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం కల్కి 2898 ఏడీ. గత నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. సినిమా చూసిన ప్రతిఒక్కరికీ ప్రభాస్-అమితాబ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరితో పాటు సినిమాలో అక్కడక్కడ కనిపించిన కమల్‌హాసన్ లుక్, డైలాగ్స్ కూడా క్యూరియాసిటీని పెంచాయి. మూవీలో ఆయన విలన్ యాస్కీన్ పాత్రలో కనిపించారు. రెండో భాగంలో ఆయన నిడివి ఎక్కువగా ఉండనుంది.
అయితే తాజాగా కమల్ హాసన్ మూవీ సక్సెస్‌పై ప్రత్యేకంగా మాట్లాడారు. "కల్కి సక్సెస్ అవ్వగానే నాకు వరుసగా ఫోన్ కాల్స్ కంటిస్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఈ కలెక్షన్లు చూస్తుంటే నాకు చాలా ఎక్కువ ఆనందంగా ఉంది. ఇది చాలా హ్యాపీ మూమెంట్. నా సినీ కెరీర్‌లో 250 ఆర్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒకట్రెండు చిత్రాల విషయంలో కాస్త బద్దకించి ఉంటాను. అలానే అన్ని చిత్రాలు అందరిని ఆకట్టుకుని ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమాకు మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి.
కల్కిలో యాస్కీన్ పాత్ర కోసం చాలా కష్టపడ్డాం. ఆ లుక్, గెటప్ చూడంగానే నాకే కాస్త ఇబ్బందిగా అనిపించింది. అలానే చాలా ఉత్సాహంగానూ అనిపించింది. యాస్కిన్ పాత్ర కోసం ఎన్నో డిజైన్లు చేశారు. మేకప్ కోసం లాస్ ఏంజెల్స్ కూడా వెళ్లాం. ఇదంతా ఒక్క పాత్ర కోసమే చేశాం. సినిమా మొత్తం గట్టిగా పది పాత్రలు ఉన్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్స్ అంతా కలిసి ఇందులో నటించారు.
అసలు కల్కి ఆలోచన అనేది ఒక ఆట లాంటిది. చిన్నపిలల్లకే అది అర్థమవుతుంది. మనం చిన్న పిల్లలతో కలిసి ఆడుతుంటే వాళ్లు మన కోసం ఇదిగో నీ కోసం ఇది వండాను. తిను అంటే, అక్కడ ఏమీ లేకపోయినా, మనం తిన్నట్లు నటిస్తాం. ఈ మూవీ కూడా అలాంటిదే. ఆడియెన్స్‌ను అలా మాయ చేస్తుంది. అలా ఆడించిన చిన్న పిల్లాడే నాగ్ అశ్విన్. ఒకప్పుడు సింగీతం శ్రీనివాసరావు ఇలానే ఉండేవారు. ఫైనల్‌గా కల్కి చూసి మీరు ఎంత సంతోషపడితే మేము అంత ఆనందిస్తాం" అని కమల్‌హాసన్ చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ - ఆ హాలీవుడ్ స్టార్ హీరో కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా! - Kalki 2898 AD Kamal Haasan
OTTలోకి 9 మంది స్టార్ హీరోలు కలిసి నటించిన సిరీస్!- స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Manorathangal OTT