ETV Bharat / entertainment

డార్లింగ్ బర్త్​డే స్పెషల్ - ప్రభాస్ గురించి ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

రెబల్​ స్టార్ బర్త్​ డే స్పెషల్ - ప్రభాస్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Prabhas Birthday Special
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Interesting Facts About Prabhas : మాస్‌, సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ, పౌరాణికం ఇలా ఎటువంటి జానరైనా కూడా అలవోకగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తారు రెబల్​స్టార్ ప్రభాస్. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ వద్ద దుసుకెళ్లారు. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన క్రేజ్​తో ఇంటర్నేషనల్ లెవెల్​లో పాపులర్​ అయ్యారు. నేడు (అక్టోబర్ 23) ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మన డార్లింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు మీ కోసం.

  1. ప్రభాస్ నటించిన మొదటి సినిమా పేరు 'ఈశ్వర్‌'. 2002లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్​ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్​ పడ్డాయి.
  2. పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి చేసి మూడు చిత్రాల్లో నటించారు. అందులో 'బిల్లా', 'రెబల్'​లో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్​ రోల్స్​లో కనిపించగా, 'రాధే శ్వామ్'​లో మాత్రం కృష్ణం రాజు అతిథి పాత్రలో కనిపించారు.
  3. తన సినీ కెరీర్​లో ప్రభాస్​ పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అందులో నంది ఉత్తమ నటుడు (మిర్చి), సైమా ఉత్తమ నటుడు (బాహుబలి 2) ఉండటం విశేషం.
  4. 'యాక్షన్‌ జాక్సన్'​ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో మెరిశారు ప్రభాస్​. ఆ తర్వాత దేనికైనా రెడీ సినిమాకు ఆయన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.
  5. ప్రభాస్​తో మూడుసార్లు నటించిన హీరోయిన్ల లిస్ట్​లో త్రిష (వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి), అనుష్క (బిల్లా, మిర్చి, బాహుబలి) ఉన్నారు. అలాగే ఆయన రాజమౌళి (ఛత్రపతి, బాహుబలి) పూరి జగన్నాథ్​తో (బుజ్జిగాడు, ఏక్‌ నిరంజన్‌) రెండుసార్లు వర్క్ చేశారు.
  6. ప్రభాస్ కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి: ది కన్‌క్లూజన్‌ రికార్డుకెక్కింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి భారతీయ మూవీ కూడా ఇదే కావడం విశేషం
  7. 'ఆదిపురుష్'​లో రాముడిగా ఇతిహాసగాథలో కనిపించిన ప్రభాస్​, కల్కి (కర్ణ), కన్నప్ప (నంది!) లాంటి పౌరాణిక రంగంలోనూ మెరిశారు.
  8. ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు.
  9. నటుడు కాకుంటే హోటల్ నడపాలని అనుకున్నట్లు ప్రభాస్​ ఓ సందర్భంలో చెప్పారు.
  10. స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నా కూడా ప్రభాస్ యాడ్స్​కు దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.

ఈటీవీ విన్ స్పెషల్ షోలో బర్త్​డే బాయ్ ప్రభాస్ - ఈ కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్​తో చూసేయొచ్చు!

'ఆ కటౌట్​ చూసి అన్ని నమ్మేయాలి డూడ్​!' - డార్లింగ్​కు చిరు స్పెషల్ విషెస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.